Bengaluru water crisis : సమ్మర్​కి ముందే ఎండిపోతున్న 'బెంగళూరు'! అల్లాడిపోతున్న ప్రజలు..-bengaluru water crisis city is running dry even before summer ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru Water Crisis : సమ్మర్​కి ముందే ఎండిపోతున్న 'బెంగళూరు'! అల్లాడిపోతున్న ప్రజలు..

Bengaluru water crisis : సమ్మర్​కి ముందే ఎండిపోతున్న 'బెంగళూరు'! అల్లాడిపోతున్న ప్రజలు..

Sharath Chitturi HT Telugu
Feb 24, 2024 06:08 AM IST

Bengaluru water shortage : భారత దేశ సిలికాన్​ వ్యాలీ బెంగళూరులో తీవ్ర మంచి నీటి సంక్షోభం నెలకొంది! జనవరి నుంచి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇక వేసవి వస్తే ఎలా? అని ప్రజలు భయపడిపోతున్నారు.

సమ్మర్​కి ముందే ఎండిపోతున్న 'బెంగళూరు'! ప్రజల్లో భయం..
సమ్మర్​కి ముందే ఎండిపోతున్న 'బెంగళూరు'! ప్రజల్లో భయం.. (REUTERS)

Bangalore water crisis 2024 : కర్ణాటక రాజధాని, భారత దేశ సిలికాన్​ వ్యాలీలో బెంగళూరులో ప్రజలు.. 'నీటి' కష్టాలతో అల్లాడిపోతున్నారు! వేసవి కాలం మొదలవ్వకముందే.. బెంగళూరు మహా నగరం ఎండిపోతోంది. ఇప్పటికే పరిస్థితులు ఆందోళనగా మారగా.. రానున్న రోజులు ఇంకెంత ఘోరంగా ఉంటాయో అని ప్రజలు భయపడిపోతున్నారు.

బెంగళూరులో నీటి కొరత.. అల్లాడిపోతున్న ప్రజలు..

బెంగళూరులో నీటి కొరత ప్రభావం అనేక ప్రాంతాల్లో కనిపిస్తోంది. మాటిమాటికి నీటి సప్లై ఆగిపోతోంది. జనవరి రెండో వారం నుంచి పరిస్థితి బెంగళూరులో నీటి సంక్షోభం నెలకొంది. ఈ పరిణామాలతో ప్రజలు.. ప్రైవేట్​ ట్యాంకర్లను ఉపయోగించుకుంటున్నారు. అదే సమయంలో.. ఇదే సరైన సమయం అని భావిస్తున్న ప్రైవేట్​ ట్యాంకర్​ సంస్థలు.. ధరలను అమాంతం పెంచేస్తున్నాయి.

వేలాది మంది ఐటీ ఉద్యోగులు, అనేక స్టార్టప్​ సంస్థలు, కోటికిపైగా జనాభా కలిగి ఉన్న బెంగళూరులో నీటి కొరత ఎందుకు కనిపిస్తోంది? అది కూడా.. వేసవి కాలం ఇంకా మొదలవ్వకముందే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే.. చాలా కారణాలు కనిపిస్తున్నాయి. గతేడాది.. నగరంలో వర్షాలు సరిగ్గా పడలేదు. బోర్​వెల్స్​ ఎండిపోయాయి. గ్రౌండ్​ వాటర్​ లెవల్స్​ పడిపోయాయి. మౌలికవసతులు సరిగ్గా లేవు. వీటికి తోడు నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న మంచి నీటి ట్యాంకర్​ మాఫియా కూడా ఇబ్బందికరంగా మారింది.

Bangalore water shortage today : బెంగళూరులు వాటర్​ సప్లై అండ్​ సీవరేజ్​ బోర్డ్​కు.. కావేరీ నది నుంచి అధిక మొత్తంలో నీరు అందుతుంది. కావేరీ నదికి యాక్సెస్​ లేని ప్రాంతాలు.. బోర్​వెల్స్​, వాటర్​ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి ఉంటుంది. బెంగళూరుకు రోజుకు 1,450 మిలియన్​ లీటర్ల నీరు అందుతుంది. కానీ ఇంకో 1,680 మిలియన్​ లీటర్ల మంచి నీటి కొరత ప్రతి రోజు ఉంటోంది!

ఈ నేపథ్యంలో ప్రైవేట్​ ట్యాంకర్లపై బెంగళూరు ప్రజలు అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. అవేమో.. ధరలను అమాంతం పెంచేస్తున్నాయి.

"బెంగళూరులో నీటి కొరత ఉంది. మేము ప్రైవేట్​ ట్యాంకర్లను బుక్​ చేసుకుంటున్నాము. కానీ అవి ధరలను.. నెల రోజుల్లో రెండింతలు పెంచాయి. ఇప్పుడు రూ. 1,500 కడుతున్నాము. కేవలం రూ. 6000.. ట్యాంకర్లకే వెళిపోతోంది. గతంలో అది రూ. 700గా ఉండేది!," అని ఓ నగరవాసి..ఓ జాతీయ మీడియాతో చెప్పాడు.

Bangalore water crisis latest news : అంతేకాకుండా.. రోజురోజుకు పెరిగిపోతున్న బెంగళూరు జనాభా కూడా తాజా పరిస్థితులకు కారణం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నగరంలో 1 కోటికిపైగా మంది ప్రజలు నివాసముంటున్నారు. ఈ సంఖ్య ప్రతి యేటా.. 10లక్షలు పెరుగుతూ వస్తోంది. కానీ మౌలిక వసతులు మాత్రం అదే రేటులో అభివృద్ధిచెందడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి.

ఓవైపు జనాభా పెరుగుతుంటే.. మరోవైపు బెంగళూరులోని చెరువులు వంటివి కనుమరుగైపోతున్నాయి! 4 దశాబ్దాల్లో 79శాతం నీటి వనరులు అంతరించిపోయాయని ఐఐఎస్​సీ అధ్యయనం చెబుతోంది.

ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో?

బెంగళూరులో నీటి కొరతపైనా దూమారం రేగింది. ఓవైపు.. కాంగ్రెస్​ పార్టీ నేతలు వాటర్​ ట్యాంకర్​ యాజమాన్యంపై మండిపడుతుంటే.. మరోవైపు.. బీజేపీ అధికార ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్​.. సరిగ్గా ప్లాన్​ చేసి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆరోపిస్తోంది.

Bangalore water crisis solution : అయితే.. కావేరీ నదిపై మేకదాతు డ్యామ్​ నిర్మాణమే.. బెంగళూరులో నీటి కొరతకు పరిష్కారం అని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. కానీ ఆ డ్యామ్​ ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. దాని చుట్టూ.. కర్ణాటక- తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. కావేరీ జలాల సరఫరాపై ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి.

మంచీ నీటి కొరతను దూరం చేసి, మౌలికవసతులను మెరుగుపరిచేందుకు.. తాజా బడ్జెట్​లో రూ. 200 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. ఇక వాటర్​ ట్యాంకర్ల రేట్లను కూడా ఫిక్స్​ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

మరి ఈ చర్యలు బెంగళూరు నీటి కొరతను పరిష్కరిస్తాయా? వేసవి కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయి? అనేది కాలమే చెబుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం