AP Congress CPI CPM: వైసీపీ,టీడీపీ బీజేపీ బానిసలన్న షర్మిల..వామపక్షాలతో కలిసి పోరాటాలకు సిద్ధమైన కాంగ్రెస్-pcc president sharmila accused that tdp ycp are slaves of bjp ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Congress Cpi Cpm: వైసీపీ,టీడీపీ బీజేపీ బానిసలన్న షర్మిల..వామపక్షాలతో కలిసి పోరాటాలకు సిద్ధమైన కాంగ్రెస్

AP Congress CPI CPM: వైసీపీ,టీడీపీ బీజేపీ బానిసలన్న షర్మిల..వామపక్షాలతో కలిసి పోరాటాలకు సిద్ధమైన కాంగ్రెస్

Sarath chandra.B HT Telugu
Feb 23, 2024 12:01 PM IST

AP Congress CPI CPM: ఏపీలో మరో రాజకీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఎంలు కలిసి రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. విజయవాడలో మూడు పార్టీల మధ్య చర్చలు జరిగాయి.

సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులతో పిసిసి అధ్యక్షురాలు షర్మిల
సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులతో పిసిసి అధ్యక్షురాలు షర్మిల

AP Congress CPI CPM: ఎన్నికల పోరాటంలో భాగంగా ఏపీలో కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఎంలు కలిసి పోరాడాలని నిర్ణయించాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై చర్చించిన పార్టీలు ప్రజాపోరాటాలను కలిసి సీపీ,టీడీపీ బీజేపీ బానిసలన్న షర్మిల..వామపక్షాలతో కలిసి పోరాటాలకు సిద్ధమైన కాంగ్రెస్ చేయాలని నిర్ణయించాయి.

వామపక్షాలతో ఎన్నికల పొత్తుల దిశగా కాంగ్రెస్ చర్చలు ప్రారంభించింద.ి ఆంధ్రరత్న భవన్ లో APCC చీఫ్ వైఎస్ షర్మిలతో సమావేశమైన CPM,CPI నేతలు సమావేశమయ్యారు. CPM నుంచి M.A గఫూర్, వెంకటేశ్వర్ రావు,శ్రీనివాస్ రావు హాజరయ్యారు. CPI నుంచి రామకృష్ణ, నాగేశ్వర రావు, అక్కినేని వనజ,జల్లి విల్సన్ హాజరయ్యారు. ఇకపై ప్రభుత్వంపై కలిసి పోరాటాలు చేయాలని నిర్ణయించారు.

అమరావతి రాజధాని అని‌ చంద్రబాబు త్రీడీ‌ చూపిస్తే, జగన్ అసలు ఏ రాజధాని లేకుండా చేశారన్నారు. YCP, TDPలు రెండు బీజేపీకి బానిసలని షర్మిల ఆరోపించారు. బీజేపీకి తొత్తులుగా మారి ఆంధ్ర రాష్ట్ర హక్కులను కాల రాస్తున్నారని ఆరోపించారు.

ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ఇందుకోసం వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు. ఉమ్మడిగా పోరాడే అంశంపై చర్చలు జరిపినట్టు షర్మిల ప్రకటించారు.

ఇకపై తామంతా కలిసికట్టుగా పోరాటాలు చేస్తామని ప్రకటించారు. కలిసి కట్టుగా లేక పోతే ఈ పెద్ద పర్వతాలను దించడం అసాధ్యమని, అనంతపురంలో జరిగే సభకు CPI,CPM లను ఆహ్వానించినట్టు షర్మిల వివరించారు.

ఎన్నికల్లో సీట్లపై చర్చలు జరుగుతున్నాయని, పొత్తులపై త్వరలో అన్ని అంశాల మీద క్లారిటీ వస్తుందన్నారు. కాంగ్రెస్ 2014 అధికారంలో వచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా వచ్చేదని, హోదా విషయంలో జగన్,బాబు ఇద్దరు విఫలం అయ్యారని YS Sharmila ఆరోపించారు.

పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందలేదనేది వాస్తవమని, దీనికి కేంద్రంతో పాటు రాష్ట్రంలో అధికారం లో ఉన్న రాజకీయ పార్టీ లే కారణమని షర్మిల ఆరోపించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విభజన హామీలను అమలు చేయ లేదని , పార్లమెంటులో హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని నాడు చెప్పిన పార్టీ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఏపీకి అప్పుడే ప్రత్యేక హోదా వచ్చేదన్నారు. తిరుపతి లోనే మోడీ పదేళ్లు హోదా ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. నేటికీ హక్కులలో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు.

చంద్రబాబు కూడా నాడు బీజేపీతో పొత్తు పెట్టుకుని కేంద్రంలో మంత్రి పదవులు తీసుకున్నారని, తర్వాత చంద్రబాబు హోదా కాదు, ప్యాకేజీ చాలని సరి పెట్టారన్నారు.

హోదా తెస్తాం అధికారం ఇవ్వండని జగన్ అన్నారని, బీజేపీ మెడలు వంచుతామన్న జగన్ ఈ ఐదేళ్లల్లో ఒక్క పోరాటం కూడా చేయ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రం నుంచి గెలిచిన ఎంపీలు ఒక్కరు కూడా హోదా కోసం రాజీనామా చేయ లేదని, పోలవరం విషయంలో కూడా ప్రజలకు అన్యాయం చేశారని, హోదా ఇవ్వకపోవడం వల్లే మనకి పరిశ్రమలు రాలేదన్నారు. ఉద్యోగాలు ఇక్కడ లేక పొట్ట చేతబట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి వచ్చిందని ఆరోపించారు.

ఆళ్లపై రాజకీయ ఒత్తిళ్లు…

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి తిరిగి వైసీపీలోకి వెళ్లడంపై షర్మిల స్పందించారు. ఆళ్ల తనకు దగ్గర మనిషి అని, ఆయన ఎక్కడున్నా బాగుండాలన్నారు. ఆయన మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడులు ఉన్నాయని, ఆయన చెల్లెలిగా పరిస్థితిని తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. మంచి పర్సన్ ,ఒక రాంగ్ ప్లేస్ లో ఉన్నాడన్నారు.

కాంగ్రెస్ సహకారం తీసుకుంటామన్న వామపక్షాలు…

బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని, బీజేపీ,YCP,TDP మీద తమ పోరాటం కొనసాగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రావు చెప్పారు. ఈ కూటములు రాష్ట్రాన్ని ఘోరంగా మోసం చేశాయని, రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటు షేర్ లేని బీజేపీ శాసిస్తుందని, బీజేపీ మీద దుమ్మెత్తి పోసిన బాబు ఇప్పుడు పొర్లు దండాలు పెడుతున్నారన్నారు.

బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఇన్ని సార్లు డిల్లీ చుట్టూ తిరగడం లేదని, ఇన్ని సార్లు తిరిగిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని ఎద్దేవా చేశారు. రాజధానికి నిధులు లేవని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో సహకారం తీసుకుంటామన్నారు. అందరం కలిసి కట్టుగా ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. దుష్ట కూటమిలను ఓడిస్తామన్నారు.

BJP మత తత్వ రాజకీయాలు చేస్తోందని, బీజేపీ మళ్ళీ అధికారంలో వస్తె అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మారుస్తారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. దేశం అత్యంత ప్రమాదంలో ఉందని, ప్రధాన మైన ప్రాంతీయ పార్టీలు బీజేపీ కి భయపడుతున్నాయన్నారు. జగన్,బాబు,పవన్ మోడీకి దాసోహం అంటున్నారని తెలుగు ప్రజల ఆత్మ గౌరవం బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇతర ప్రజా తంత్ర పార్టీలను కూడా కూడగడతామని చెప్పారు.

Whats_app_banner