తెలుగు న్యూస్ / ఫోటో /
YS Sharmila Arrest : వైఎస్ షర్మిల అరెస్ట్- ప్రజాస్వామ్యమా? రాచరికమా? అంటూ ఆగ్రహం
YS Sharmila Arrest : ఏపీ కాంగ్రెస్ చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. మెగా డీఎస్సీ ప్రకటించాలని కాంగ్రెస్ నేతలు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. సచివాలయానికి బయలుదేరిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు.
(1 / 5)
ఏపీ కాంగ్రెస్ చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని కాంగ్రెస్(Congress) నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆంధ్రరత్న భవన్ నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. భారీగా పోలీసులను మోహరించారు. అనంతరం ఆంధ్రరత్న భవన్ నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలిసి వైఎస్ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు.
(2 / 5)
సచివాలయానికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఉండవల్లి కరకట్ట సమీపంలో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొండవీటి ఎత్తిపోతల సమీపంలో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు(YS Sharmila Arrest) చేశారు. ఆమెను వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారు. ఆమెను ఏ స్టేషన్ కు తరలించారో తెలియలేదని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
(3 / 5)
సీఎం జగన్ ప్రత్యేక రాజ్యాంగంలో ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని షర్మిల విమర్శించారు. వైసీపీ పూర్తి చేయని హామీలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి నిర్బంధిస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక రాచరికపు పాలన లో ఉన్నామా? అని మండిపడ్డారు.
(4 / 5)
మెగా డీఎస్సీ కావాలి దగా డీఎస్సీ వద్దు అని ప్రభుత్వానికి రిప్రెజెంటేషన్ ఇద్దామని వెళ్తున్న తనతో సహా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమ అరెస్ట్ చేసి భౌతిక దాడికి పాల్పడి గాయపరచడం బాధ కలిగించిందని షర్మిల ఎక్స్ లో తెలిపారు.
ఇతర గ్యాలరీలు