తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral : ‘స్వీట్​ రివేంజ్​’- టీచర్​కే క్లాస్​ పీకిన విద్యార్థిని..!

Viral : ‘స్వీట్​ రివేంజ్​’- టీచర్​కే క్లాస్​ పీకిన విద్యార్థిని..!

Sharath Chitturi HT Telugu

26 July 2022, 10:52 IST

google News
    • ఇటీవలే 12వ తరగతి పాస్​ అయిన విద్యార్థిని.. తన 10వ తరగతి టీచర్​కు క్లాస్​ పీకింది. ‘నువ్వు దేనికి పనికి రావు’ అని టీచర్​ చెప్పిన మాటలను గుర్తుచేస్తూ.. ఓ మెసేజ్​ చేసింది. అసలేం జరిగిందంటే..
‘స్వీట్​ రివేంజ్​’- టీచర్​కే క్లాస్​ పీకిన విద్యార్థిని..!
‘స్వీట్​ రివేంజ్​’- టీచర్​కే క్లాస్​ పీకిన విద్యార్థిని..! (HT/file)

‘స్వీట్​ రివేంజ్​’- టీచర్​కే క్లాస్​ పీకిన విద్యార్థిని..!

చిన్నప్పుడు.. పిల్లలు చదువుకోకపోతే టీచర్లు వారిని మందలించడం సహజమే. కొంతమంది టీచర్లు కొడతారు కూడా! కొంతమంది.. ఇంకో అడుగు ముందుకేసి.. 'నువ్వు జీవితంలో పనికి రావు. నువ్వు ఏం సాధించలేవు,' అని క్లాస్​ ముందు.. ఆ విద్యార్థిని తిట్టేస్తారు. ఈ మాటలను కొందరు విద్యార్థులు పట్టించుకోరు. మరికొందరు.. వాటిని పట్టుకుని, తమలో మార్పులు చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. అయితే.. 'నువ్వు దేనికి పనికి రావు,' అన్న టీచర్​కు ఓ విద్యార్థిని క్లాస్​ పీకింది! పెద్ద మెసేజే పంపించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఆయిషా అనే విద్యార్థిని.. ఇటీవలే 12వ తరగతి పాస్​ అయ్యింది. ఈ క్రమంలోనే తన 10వ తరగతి టీచర్​కు మెసేజ్​ చేసింది. ఆ స్క్రీన్​షాట్​ను ట్వీట్​ చేసింది. అందులో ఏముదంటే..

"హల్లో ఆషా టీచర్​. నేను మీ 2019-2020 బ్యాచ్​ 10వ తరగతి విద్యార్థిని. నేను ఏం సాధించలేనని మీరు అన్నారు. అసలు స్కూల్​ కూడా పాస్​ అవ్వలేనని అన్నారు. నా జీవితంలోని ప్రతి అడుగునూ మీరు కించపరిచారు. కానీ ఈరోజున.. నేను 12వ తరగతిలో మంచి మార్కులు సాధించాను. నాకు కావాల్సిన యూనివర్సిటీలో సీటు లభించింది. నాకు నచ్చిన కోర్సులోనే సీటు వచ్చింది. ఇది థాంక్యూ మెసేజ్​ కాదు! నేను చేసి చూపించాను.. అని చెప్పడానికే మీకు మెసేజ్​ చేశాను. ఇక నుంచైనా.. ఎవరైన విద్యార్థి సాయం కోసం వస్తే.. వారితో మంచిగా ప్రవర్తించండి," అని ఆయిషా.. తన టీచర్​కు మెసేజ్​ చేసింది.

రెండేళ్ల ముందే.. 10వ తరగతి పాసైనప్పుడే.. జీవితంలో ఏదైనా సాధించి.. టీచర్​కు మెసేజ్​ చేయాలని ఆయిషా ఫిక్స్​ అయ్యింది.

ఆ మెసేజ్​ చదివిన ఆ టీచర్​.. 'నువ్వు పాస్​ అవ్వడానికి నేనే కారణం' అని బదులిచ్చారు.

కాగా.. ఈ ట్వీట్​ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఆయిషా చేసిన పనికి నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు.. అయిషా పనికి 'వావ్​' అంటుంటే.. మరికొందరు 'ఎంత ఎత్తుకి ఎదిగినా.. టీచర్లతో అలా ప్రవర్తించకూడదు,' అని కామెంట్లు పెడుతున్నారు. 'ఆ మెసేజ్​లో.. ఆ విద్యార్థిని పడిన బాధ కనిపిస్తోంది,' అని ఇంకొందరు అంటున్నారు.

అయితే.. ఆ కామెంట్లలో.. దీపికా నారాయణ్​ అనే మహిళ.. తన కు జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు.

"నేను 10వ తరగతి పాస్​ అవ్వనని మా ప్రిన్సిపాల్​.. మా నాన్నకి చెప్పారు. ఒకవేళ నేను పాస్​ అయితే.. తన పేరు మార్చకుంటా అని అన్నారు. మా నాన్న కళ్లల్లో బాధను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను చాలా ఏడ్చేశాను. కానీ ఆ తర్వాత నేను మెరిట్​లో పాస్​ అయ్యాను. మా స్కూల్​ బ్యాచ్​ టాపర్స్​లో నేను ఉన్నాను. 'పేరు మార్చుకుంటారా?' అని మా నాన్న అడిగారు," అని దీపికా నారాయణ్​ చెప్పుకొచ్చారు.

ఇలా.. ఈ ట్వీట్​ కింద.. అనేకమంది.. తమ టీచర్లతో జరిగిన విషయాలను షేర్​ చేసుకోవడం మొదలుపెట్టారు.

తదుపరి వ్యాసం