తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  వారి మధ్య 'అక్రమ సంబంధం'- టీచర్​ను దారుణంగా చంపిన స్టూడెంట్​!

వారి మధ్య 'అక్రమ సంబంధం'- టీచర్​ను దారుణంగా చంపిన స్టూడెంట్​!

Sharath Chitturi HT Telugu

03 July 2022, 19:32 IST

  • UP crime : ఆమె ఓ పాఠశాలలో టీచర్​. 17ఏళ్ల విద్యార్థితో సంబంధం పెట్టుకుంది. చివరికి అదే విద్యార్థి చేతిలో దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. 

టీచర్​ను దారుణంగా చంపిన స్టూడెంట్​!
టీచర్​ను దారుణంగా చంపిన స్టూడెంట్​! (HT Telugu)

టీచర్​ను దారుణంగా చంపిన స్టూడెంట్​!

UP crime : ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలో దారుణ హత్యకు గురైన ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్​ కేసును పోలీసులు ఛేదించారు. 17ఏళ్ల విద్యార్థిని అరెస్ట్​ చేశారు. అక్రమ సంబంధమే ఆమె హత్యకు కారణం!

అయోధ్యలోని ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్​.. జూన్​ 1న దారుణ హత్యకు గురైంది. కాగా.. ఆ సమయంలో ఆమె గర్భవతి! ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని ఆదివారం అరెస్ట్​ చేశారు. అతను ఓ 17ఏళ్ల విద్యార్థి. కాగా.. ఆ టీచర్​, అతడి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది.

వారిద్దరు ఒకే ప్రాంతంలో నివాసముండేవారు. ఈ క్రమంలోనే కొన్ని నెలల పాటు వారి మధ్య అక్రమ సంబంధం నడిచింది. ఈ విషయం బయట తెలిస్తే.. తన పరువు పోతుందని భావించిన ఆ యువకుడు.. టీచర్​తో బంధాన్ని తెంచుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అందుకు ఆమె అడ్డుకుంది. తనతో ఉండాలని ఆమె ఒత్తిడి చేసింది.

ఆ క్రమంలోనే ఆమెను చంపేందుకు ఆ విద్యార్థి నిర్ణయించుకున్నాడు. ఎవరు లేని సమయంలో ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెను కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. అనంతరం ఆ టీచర్​ గదిలోని లాకర్​ను బద్దలు కొట్టి.. రూ. 50వేలు, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లాడు. దొంగలు చేసిన దాడిలో టీచర్​ మరణించింది, అన్న విధంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసుల దర్యాప్తులో దొరికిపోయాడు.

నిందితుడిని జువనైల్​ జస్టిస్​ బోర్డు ఎదుట హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తదుపరి వ్యాసం