తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  అక్రమ సంబంధం గురించి అడిగినందుకు..

అక్రమ సంబంధం గురించి అడిగినందుకు..

HT Telugu Desk HT Telugu

14 February 2022, 9:05 IST

    • పెళ్లయి రెండేళ్లు దాటింది. భార్యకు భర్త అక్రమ సంబంధం గురించి తెలిసింది. దీనిపై నిలదీసినందుకు భార్యపై దాడి చేసిన ఆ వ్యక్తి.. ఇంకా ఏం చేశాడో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

థానే: మహారాష్ట్రలోని థానే నగరంలో ఆదివారం తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పినందుకు 26 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సంబంధిత అధికారి తెలిపారు. అర్ఫత్ షకీల్ సయ్యద్‌పై అతని భార్య (23) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. తనకు 2019లో సయ్యద్‌తో వివాహమైందని, తమకు ఒక బిడ్డ కూడా ఉందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇటీవల ఆమెను తల్లిదండ్రుల ఇంటి వద్ద దింపిన అతడు ఆమెను కలవడానికి రాలేదు. అతడి వివాహేతర సంబంధం గురించి ఆమెకు తెలిసింది. ఆదివారం ఆమె ఈ విషయం గురించి అతడిని నిలదీయగా  దుర్భాషలాడుతూ కొట్టాడు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇస్తున్నట్టు మూడుసార్లు 'తలాక్' చెప్పాడని వాగ్లే ఎస్టేట్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. దీంతో ట్రిపుల్ తలాక్ చట్టం పరిధిలో అతడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అతడి భార్య ఫిర్యాదు ఆధారంగా అతడిపై ఐపీసీ సెక్షన్ 323 (గాయపరచడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం, 2019లోని సెక్షన్ 4 కింద కూడా ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు సదరు పోలీసు అధికారి తెలిపారు.

తదుపరి వ్యాసం