తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఒకటే బోర్డు.. ఇద్దరు టీచర్లు.. ఒకేసారి హిందీ- ఉర్దూ పాఠాలు..!

ఒకటే బోర్డు.. ఇద్దరు టీచర్లు.. ఒకేసారి హిందీ- ఉర్దూ పాఠాలు..!

HT Telugu Desk HT Telugu

17 May 2022, 12:38 IST

google News
    • ఒకే తరగతిలో ఇద్దరు టీచర్లు.. రెండు వేరు వేరు సబ్జెక్ట్​లు చెబుతున్న ఘటన బిహార్​లో చోటుచేసుకుంది. విద్యార్థులు ఏం సబ్జెక్ట్​ వినాలో తెలియక ఆయోమయంలో పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.
ఒకటే బోర్డు.. ఇద్దరు టీచర్లు.. ఒకేసారి హిందీ- ఉర్దూ పాఠాలు..!
ఒకటే బోర్డు.. ఇద్దరు టీచర్లు.. ఒకేసారి హిందీ- ఉర్దూ పాఠాలు..! (ANI)

ఒకటే బోర్డు.. ఇద్దరు టీచర్లు.. ఒకేసారి హిందీ- ఉర్దూ పాఠాలు..!

'ఒక బ్లాక్​ బోర్డు.. ఇద్దరు టీచర్లు.. రెండు వేరు వేరు భాషలపై పాఠాలు.. పిల్లల్లో అయోమయం..' ఇదీ బిహార్​లోని ఓ పాఠశాల పరిస్థితి! ఒకటే క్లాస్​రూమ్​లో ఇద్దరు టీచర్లు.. హిందీ, ఉర్దూ భాషలను పిల్లలకు నేర్పిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

కారణం అదే..

బిహార్​ కతిహార్​లోని ఆదర్ష్​ పాఠశాలలో గత కొన్నేళ్లుగా ఈ వ్యవహారం జరుగుతోంది! 2017లో.. ఉర్దూ ప్రాథమిక పాఠశాలను.. ఆదర్ష్​ పాఠశాలలో కలిపేసింది అక్కడి విద్యాశాఖ. అప్పటికే మౌలికవసతులు లేక ఇబ్బంది పడుతున్న ఆదర్ష్​ పాఠశాలకు కష్టాలు మరింత ముదిరాయి.

"బోర్డులోని ఒక భాగంపై హిందూ చెబుతాము, ఇంకో భాగంపై ఉర్దూ పాఠాలు ఉంటాయి. తరగతి గదులు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి," అని ఆదర్ష్​ పాఠశాలలోని హిందీ టీచర్​ ప్రియాంక.. ఏఎన్​ఐ వార్తాసంస్థకు పరిస్థితిని వివరించారు.

ప్రస్తుతం వైరల్​గా మారిన వీడియోలో.. మొత్తం ముగ్గురు టీచర్లు ఉన్నారు. బోర్డుపై ఒకరు హిందీ చెబుతుండగా.. మరోవైపు ఇంకొకరు ఉర్దూ పాఠాలు నేర్పిస్తున్నారు. వారి ఎదురుగా.. ఓ సీనియర్​ టీచర్​.. విద్యార్థులవైపు కూర్చున్నారు. ఏది వినాలో తెలియక.. పిల్లలు అల్లరి చేయడం, ఆ సీనియర్​ టీచర్​.. వారిని మందలించడం వైరల్​ వీడియోలో కనిపిస్తోంది.

పాఠశాలకు సంబంధించిన దృశ్యాలు వైరల్​గా మారగా.. వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారి కామేశ్వర్​ గుప్తా స్పందించారు. "ఆదర్ష్​ పాఠశాలలో ఎన్​రోల్​మెంట్​ తక్కువగా ఉంటే.. ఒక తరగతిని ఉర్దూ స్కూలుకు ఇస్తాము. విద్యార్థులు ఒకే తరగతిలో రెండు క్లాసులు వినడం మంచిది కాదు," అని వెల్లడించారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి:

టాపిక్

తదుపరి వ్యాసం