తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ayodhya Ram Mandir : చిరంజీవి, ప్రభాస్​కు అందిన రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక.. పూర్తి లిస్ట్​ ఇదే!

Ayodhya Ram Mandir : చిరంజీవి, ప్రభాస్​కు అందిన రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక.. పూర్తి లిస్ట్​ ఇదే!

Sharath Chitturi HT Telugu

09 January 2024, 12:05 IST

google News
  • Ayodhya Ram Mandir : దేశంలోని 6వేలకుపైగా మందికి రామమంది ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలు అందాయి. ఈ జాబితాలో చిరంజీవి, ప్రభాస్​లు కూడా ఉన్నారు.

చిరంజీవి, ప్రభాస్​కు అందిన రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక
చిరంజీవి, ప్రభాస్​కు అందిన రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక

చిరంజీవి, ప్రభాస్​కు అందిన రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక

Ram Mandir consecration ceremony : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఇంకా కొన్ని రోజుల సమయమే ఉంది. అత్యంత సుందరంగా నిర్మించిన రామమందిరాన్ని.. ఈ నెల 22న ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే.. జనవరి 22న జరిగే కార్యక్రమం కోసం దేశ, విదేశాల్లోని 7వేల మందికి ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది. ఇందులోని 6వేల ఆహ్వాన పత్రికలు ఇప్పటికే అథిథులకు చేరుకున్నట్టు సమాచారం. రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రిక అందుకున్న వారిలో ప్రముఖ నటులు చిరంజీవి, ప్రభాస్​ కూడా ఉన్నారు. రాజకీయ నేతల నుంచి సెలబ్రిటీల వరకు.. ఆహ్వానం అందుకున్న పలువురు ప్రముఖుల పేర్లను ఇక్కడ చూడండి..

ఎవరెవరికి ఆహ్వానం లభించిందంటే..

రాజకీయ నేతలు:- కాంగ్రెస్​ నేత సోనియా గాంధీ

బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​,

కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే

మాజీ ప్రధాని, సీనియర్​ కాంగ్రెస్​ నేత మన్మోహన్​ సింగ్​

Ram Mandir consecration ceremony latest updates : కాంగ్రెస్​ ఎంపీ అధీర్​ రంజన్​ చౌదరి

సీపీఐఎం నేతలు

మాజీ ప్రధాని హెచ్​డీ దేవె గౌడ

బీజేపీ దిగ్గజ నేతలు ఎల్​కే అద్వాని, మురళి మనోహర్​ జోషి

హిమాచల్​ ప్రదేశ్​ మంత్రి విక్రమాదిత్య సింగ్​

క్రీడాకారులు:-

విరాట్​ కోహ్లీ

సచిన్​ టెండుల్కర్​

సెలబ్రిటీలు:-

Ram Mandir on January 22 : అమితాబ్​ బచ్చన్​

మాధురి దీక్షిత్​

రజనీకాంత్​

అక్షయ్​ కుమార్​

అనుపమ్​ ఖేర్​

చిరంజీవి

సంజయ్​ లీలా బన్సాలి

ధనుశ్​

మోహన్​లాల్​

Ram mandir invitation card : రణ్​బీర్​ కపూర్​- ఆలియా భట్​

రిషభ్​ శెట్టి

కంగన రనౌత్​

మధుర్​ భండేకర్​

టైగర్​ ష్రూఫ్​- జాకీ ష్రూఫ్​

అజయ్​ దేవగన్​

ప్రభాస్​

యశ్​

సన్నీ దియోల్​

ఆయుష్మాన్​ ఖుర్రాన

అరున్​ గోవిల్​

దీపిక చిఖలియా టోపివాలా

మహావీర్​ జైన్​

వ్యాపారవేత్తలు:-

Ayodhya Ram Mandir Pratistha : రతన్​ టాటా

అనిల్​ అంబానీ

ముఖేశ్​​ అంబానీ

గౌతమ్​ అదానీ

అయోధ్యలో శరవేగంగా ఏర్పాట్లు..

జనవరి 14 నుంచి 22 వరకు అయోధ్యలో అమృత్​ మహోత్సవ్​ వేడుకలు జరుగుతాయి. ఇందుకోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మిగిలిపోయిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వారణాసికి చెందిన లక్ష్మీ కాంత్​ దీక్షిత్​.. జనవరి 22న జరగనున్న ప్రధాన పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Ayodhya Ram Mandir latest news : వైదిక శాస్త్రం ప్రకారం.. అయోధ్య రామాలయంలో జనవరి 22న.. రామ్​ లల్లా ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఇందుకోసం లక్షలాది మంది భక్తులు తరలివెళతారని అంచనా! అయితే.. ప్రజలు ఇళ్ల నుంచే చూడాలని ప్రధాని సహా అనేక మంది పిలుపునిస్తున్నారు.

తదుపరి వ్యాసం