Ayodhya Ram mandir: అయోధ్య రామమందిరాన్ని చూడాలంటే రెండు కళ్లూ చాలవు-ayodhya ram mandir two eyes are not enough to see ayodhya ram mandir places to see in ayodhya ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరాన్ని చూడాలంటే రెండు కళ్లూ చాలవు

Ayodhya Ram mandir: అయోధ్య రామమందిరాన్ని చూడాలంటే రెండు కళ్లూ చాలవు

Jan 09, 2024, 11:08 AM IST Haritha Chappa
Jan 09, 2024, 11:08 AM , IST

అయోధ్యలోని శ్రీరామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ మందిరంలో చూసేందుకు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.

ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిరంలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. దేశంలోని సాంప్రదాయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాలు ఇవిగో. 

(1 / 11)

ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిరంలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. దేశంలోని సాంప్రదాయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాలు ఇవిగో. (File Photo)

ఈ రామమందిరం మూడు అంతస్థుల ఆలయం. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. 

(2 / 11)

ఈ రామమందిరం మూడు అంతస్థుల ఆలయం. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. (ANI)

అయోధ్యలోని రామమందిరానికి ప్రధాన ద్వారం ఏనుగులు, సింహాలు, హనుమంతుడు, గరుడ విగ్రహాలతో అలంకరించారు. ఈ విగ్రహాలు రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్ ప్రాంతం నుండి సేకరించిన ఇసుకరాయితో తయారు చేశారు. 

(3 / 11)

అయోధ్యలోని రామమందిరానికి ప్రధాన ద్వారం ఏనుగులు, సింహాలు, హనుమంతుడు, గరుడ విగ్రహాలతో అలంకరించారు. ఈ విగ్రహాలు రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్ ప్రాంతం నుండి సేకరించిన ఇసుకరాయితో తయారు చేశారు. (ANI)

సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన ఈ ఆలయం 380 అడుగుల పొడవు (తూర్పు-పశ్చిమ దిశ), 250 అడుగుల వెడల్పుతో, 161 అడుగుల ఎత్తుతో నిర్మించారు.

(4 / 11)

సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన ఈ ఆలయం 380 అడుగుల పొడవు (తూర్పు-పశ్చిమ దిశ), 250 అడుగుల వెడల్పుతో, 161 అడుగుల ఎత్తుతో నిర్మించారు.(ANI)

దేవాలయం ముందు సింహద్వారం, ఆ మెట్లపై సింహాలు, ఏనుగుల విగ్రహాలు ఉంటాయి.

(5 / 11)

దేవాలయం ముందు సింహద్వారం, ఆ మెట్లపై సింహాలు, ఏనుగుల విగ్రహాలు ఉంటాయి.(ANI)

ఇది ఆలయం లోపల ఉన్న గర్భగుడి దృశ్యం. రాంలాలా లేదా బాలరాముని విగ్రహం ఇక్కడ ప్రతిష్టిస్తారు. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్ ఉంది.

(6 / 11)

ఇది ఆలయం లోపల ఉన్న గర్భగుడి దృశ్యం. రాంలాలా లేదా బాలరాముని విగ్రహం ఇక్కడ ప్రతిష్టిస్తారు. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్ ఉంది.(PTI)

సూర్య భగవానుడి విగ్రహం

(7 / 11)

సూర్య భగవానుడి విగ్రహం(ANI)

ఆలయం లోపలి దృశ్యం

(8 / 11)

ఆలయం లోపలి దృశ్యం(Shri Ram Janmbhoomi Teerth Kshet)

ఆలయ ప్రధాన ద్వారం తూర్పు వైపున ఉంది. దీనినే సింహ ద్వారం అంటారు. ఇక్కడ నుంచి 32 మెట్లు ఎక్కి ఆలయంలోకి ప్రవేశించవచ్చు. వికలాంగులు,వృద్ధుల కోసం ర్యాంప్‌లు, లిఫ్టులు ఉన్నాయి. 

(9 / 11)

ఆలయ ప్రధాన ద్వారం తూర్పు వైపున ఉంది. దీనినే సింహ ద్వారం అంటారు. ఇక్కడ నుంచి 32 మెట్లు ఎక్కి ఆలయంలోకి ప్రవేశించవచ్చు. వికలాంగులు,వృద్ధుల కోసం ర్యాంప్‌లు, లిఫ్టులు ఉన్నాయి. (HT Photo/Deepak Gupta)

ఆలయం చుట్టూ పెర్కోటా (దీర్ఘచతురస్రాకార గోడ) 732 మీటర్ల పొడవుతో, 14 అడుగుల వెడల్పుతో ఉంటుంది.

(10 / 11)

ఆలయం చుట్టూ పెర్కోటా (దీర్ఘచతురస్రాకార గోడ) 732 మీటర్ల పొడవుతో, 14 అడుగుల వెడల్పుతో ఉంటుంది.(PTI)

ఆలయం పునాది 14 మీటర్ల మందపాటి పొరతో రోలర్-కాంపాక్ట్ కాంక్రీటుతో నిర్మించారు. ఆలయానికి సమీపంలోనే ప్రసిద్ధ చారిత్రక సీతా కూపం ఉంది.

(11 / 11)

ఆలయం పునాది 14 మీటర్ల మందపాటి పొరతో రోలర్-కాంపాక్ట్ కాంక్రీటుతో నిర్మించారు. ఆలయానికి సమీపంలోనే ప్రసిద్ధ చారిత్రక సీతా కూపం ఉంది.(AP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు