Mukesh Ambani children: రిలయన్స్ బోర్డులోకి ముకేశ్ అంబానీ పిల్లలు; కానీ నో సాలరీ-no salary for mukesh ambanis children only fee for attending board meets ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mukesh Ambani Children: రిలయన్స్ బోర్డులోకి ముకేశ్ అంబానీ పిల్లలు; కానీ నో సాలరీ

Mukesh Ambani children: రిలయన్స్ బోర్డులోకి ముకేశ్ అంబానీ పిల్లలు; కానీ నో సాలరీ

HT Telugu Desk HT Telugu
Sep 26, 2023 08:58 PM IST

Mukesh Ambani children: భారత్ కు చెందిన ప్రముఖ బిజినెస్ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఆ సంస్థ చీఫ్ ముకేశ్ అంబానీ పిల్లలు ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీలకు స్థానం కల్పిస్తున్నారు. ఈ మేరకు షేర్ హోల్డర్ల అనుమతి కోరుతూ సంస్థ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.

ముకేశ్ అంబానీ కుటుంబం
ముకేశ్ అంబానీ కుటుంబం

Mukesh Ambani children: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఆ సంస్థ చీఫ్ ముఖేష్ అంబానీ పిల్లలు ఇషా అంబానీ, అనంత అంబానీ, ఆకాశ్ అంబానీ లకు స్థానం కల్పిస్తున్నారు. అయితే ఈ హోదాకు గానూ వారికి ఎలాంటి వేతనం ఇవ్వడం లేదు. బోర్డు సమావేశాలకు, కమిటీ సమావేశాలకు హాజరైన సమయంలో అందుకు సంబంధించిన ఫీజులు మాత్రం వారికి చెల్లిస్తారు.

షేర్ హోల్డర్ల అనుమతి..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఆ సంస్థ చీఫ్ ముఖేష్ అంబానీ పిల్లలు ఇషా అంబానీ, అనంత అంబానీ, ఆకాశ్ అంబానీ లకు స్థానం కల్పించడానికి షేర్ హోల్డర్ల అనుమతి కోరుతూ ఒక తీర్మానాన్ని సంస్థ మంగళవారం ఆమోదించింది. వారి అపాయింట్ మెంట్ కు షేర్ హోల్డర్ల అనుమతి కోరుతూ.. షేర్ హోల్డర్ల అందరికీ పోస్టల్ బ్యాలెట్ ను పంపించనున్నారు. సంస్థలో భవిష్యత్ తరం నాయకులను రూపొందించే దిశగా, సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసేవారుగా ఆ ముగ్గురిని బోర్డులోకి తీసుకుంటున్నట్లు సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని నిజానికి గత నెలలో జరిగిన యాన్యువల్ జనరల్ మీటింగ్ లోనే వెల్లడించారు. ఇప్పుడు తాజాగా ఎందుకు సంబంధించిన నోటిఫికేషన్ ని షేర్ హోల్డర్స్ అనుమతి కోరుతూ విడుదల చేశారు. షేర్ హోల్డర్లందరికీ ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్ ని పంపిస్తున్నారు.

కవల పిల్లలు..

‘‘బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఇషా అంబానీ, అనంత్ అంబానీ, ఆకాశ్ అంబానీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు మీటింగ్ లకు, కమిటీ సమావేశాలకు హాజరవుతారు. అందుకుగాను వారికి ఫీజును మాత్రం చెల్లిస్తారు. అంతేగాని ప్రత్యేకంగా వారికి నెలవారి వేతనం అంటూ ఏమి ఉండదు’’ అని ఆ నోటీసులో పేర్కొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ముకేశ్ అంబానీ వ్యవహరిస్తున్నారు. 2020 - 2021 ఆర్థిక సంవత్సరం నుంచి ఆ హోదాలో ముకేశ్ అంబానీ ఎలాంటి వేతనం తీసుకోవడం లేదు. కాగా ముకేశ్ అంబానీ పిల్లల్లో ఆకాష్, ఈషా కవల పిల్లలు. వారి వయస్సు ప్రస్తుతం 31 సంవత్సరాలు. అనంత్ అంబానీ వయస్సు 28 సంవత్సరాలు. 2014లో ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరుగా చేరారు. ఆమెకు 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్ల రూపాయల కమిషన్, 6 లక్షల రూపాయల సిట్టింగ్ ఫీజు అందించారు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ వయస్సు 66 సంవత్సరాలు. గత నెలలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం లో తన పిల్లలు అనంత్, ఆకాశ్, ఈషాలకు సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా స్థానం కల్పిస్తున్నట్లు ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ, అనంత్ అంబానీ ఇప్పటికే రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ సంస్థల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఉన్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డ్ లో ఈషా అంబానీ ఉన్నారు.