తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Anna Hazare : అరవింద్​ కేజ్రీవాల్​ అరెస్ట్​పై అన్న హజారే రియాక్షన్​ ఇది- ‘చేసిన పనులు..’

Anna Hazare : అరవింద్​ కేజ్రీవాల్​ అరెస్ట్​పై అన్న హజారే రియాక్షన్​ ఇది- ‘చేసిన పనులు..’

Sharath Chitturi HT Telugu

22 March 2024, 13:29 IST

  • Anna Hazare Arvind Kejriwal : అరవింద్​ కేజ్రీవాల్​ అరెస్ట్​పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్న హజారే స్పందించారు. వీరిద్దరు కలిసి.. గతంలో అవినీతిపై ఉద్యమం చేసిన విషయం తెలిసిందే!

అన్న హజారేతో అరవింద్​ కేజ్రీవాల్​...
అన్న హజారేతో అరవింద్​ కేజ్రీవాల్​... (PTI)

అన్న హజారేతో అరవింద్​ కేజ్రీవాల్​...

Anna Hazare on Arvind Kejriwal : సామాజిక కార్యకర్త అన్న హజారే.. దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ అరెస్ట్​పై స్పందించారు. కేజ్రీవాల్​ అరెస్ట్​కు.. ఆయన చేసిన పనులే కారణం అన్ని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Southest Monsoon : గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

CBSE Class 10 results : సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

2010 దశకంలో అవినీతికి వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో ఉద్యమాన్ని ముందుండి నడిపించారు అన్న హజారే. అదే ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, పేరు తెచ్చుకున్నారు అరవింద్​ కేజ్రీవాల్​.

తాము మద్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశామని, కానీ ఇప్పుడు.. అదే మద్యానికి పాలసీలు చేస్తూ కేజ్రీవాల్​ అరెస్ట్​ అయ్యారని అన్నారు అన్న హజారే..

"నాతో కలిసి పనిచేసి, మద్యానికి వ్యతిరేకంగా పోరాడిన అరవింద్​ కేజ్రీవాల్​.. ఇప్పుడు అదే విషయంపై పాలసీలు చేస్తుండటం బాధగా ఉంది. కేజ్రీవాల్​ అరెస్ట్​కు కారణం.. ఆయన చేసిన పనులే," అని తెలిపారు అన్న హజారే.

Arvind Kejriwal arrested : నాడు.. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్​ ప్రభుత్వం.. అవినీతికి వ్యతిరేకంగా లోక్​పాల్​ని తీసుకురోవాలని తీవ్రస్థాయిలో ఉద్యమం చేశారు అన్న హజారే, అరవింద్​ కేజ్రీవాల్​. ఇద్దరు.. అనేకమార్లు నిరాహార దీక్ష చేశారు. ఈ ఇద్దరికి కోట్లాది మంది భారతీయులు మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో.. ఉద్యమం వెనుక రాజకీయం లేదని అన్న హజారే చెబుతూ వచ్చారు. కానీ ఉద్యమం తుదు దశకు చేరుకున్నప్పుడు.. ఇతరులతో కలిసి ఆమ్​ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు అరవింద్​ కేజ్రీవాల్​.

కేజ్రీవాల్​.. రాజకీయ పార్టీ పెట్టడంపై అనేకమార్లు అసంతృప్తిని, అసహానన్ని వ్యక్తం చేశారు అన్న హజారే.

అరవింద్​ కేజ్రీవాల్​ని ఎందుకు అరెస్ట్​ చేశారు..?

దిల్లీ లిక్కర్​ పాలసీ కేసులో మనీ లాండింగ్​ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ని ఈడీ అధికారులు.. గురువారం రాత్రి అరెస్ట్​ చేశారు. దేశంలో పదవిలో ఉన్న ఒక సీఎం అరెస్ట్​ అవ్వడం ఇదే తొలిసారి!

Delhi liquor scam case explained in Telugu : ఇదే కేసులో.. బీఆర్​ఎస్​ నేత కవిత, ఆమ్​ ఆద్మీ నేత- దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, ఎంపీ సంజయ్​ సింగ్​లు ఇప్పటికే జైలులో ఉన్నారు. అసలేంటి ఈ లిక్కర్​ స్కామ్​ కేసు? అని తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

అరవింద్​ కేజ్రీవాల్​ అరెస్ట్​ అయినప్పటికీ.. జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఆమ్​ ఆద్మీ చెబుతోంది. కానీ.. నైతిక బాధ్యత వహిస్తూ, ఆయన రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్​ చేస్తుంది. వీటన్నింటి మధ్య.. దిల్లీవ్యాప్తంగా భారీ స్థాయిలో నిరసనలకు ప్రణాళికలు రచిస్తోంది ఆమ్​ ఆద్మీ. ట్రాఫిక్​ జామ్​లతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.

తదుపరి వ్యాసం