Loan on FD : ఎఫ్‌డీలపై 'లోన్' కావాలా? ఇలా చేయండి!
27 August 2022, 13:44 IST
- Loan on FD in SBI : మీకు ఎస్బీఐ బ్యాంక్‌లో ఎఫ్డీ ఉందా? దాని మీద లోన్ తీసుకోవచ్చు. ఆ వివరాలు..
ఎఫ్‌డీలపై 'లోన్' కావాలా? ఇలా చేయండి!
Loan on FD in SBI : ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడో.. లేదా అవసరాల కోసమో మనం అప్పులు చేస్తూ ఉంటాము. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాము. అయితే.. బ్యాంకుల్లో వేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్డీ)లపై కూడా లోన్లు తీసుకోవచ్చని మీకు తెలుసా? ఇలా ఎఫ్‌డీలపై తీసుకునే లోన్ల కోసం సిబిల్ స్కోర్ కూడా చెక్ చేయరు! మీ ఎఫ్డీలను చూసే రుణాలు ఇచ్చేస్తారు.
ఎఫ్‌డీలపై లోన్.. ఎవరు అర్హులు?
- భారత పౌరులు
- హిందూ అన్డివిడెడ్ ఫ్యామిలీ(హెచ్‌యూఎఫ్)
- ప్రొప్రైటర్‌షిప్, పార్టన్నర్షిప్ సంస్థలు
- అసోసియేషన్లు
- ట్రస్ట్‌లు
ఎస్బీఐలో ఎఫ్‌డీలపై లోన్.. ఫీచర్స్ ఇవే..
- Loan against FD in SBI : ఎస్బీఐ టైమ్ డిపాజిట్లపై 95శాతం వరకు లోన్ తీసుకోవచ్చు
- డిమాండ్ లోన్ లేదా ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం ద్వారా రుణం పొందవచ్చు
- వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి
- జిరో ప్రాసెసింగ్ ఫీజు
- ప్రీపేమెంట్ పెనాల్టీలు లేవు
- ఎఫ్‌డీలపై ఆన్లైన్ ఓవర్‌డ్రాఫ్ట్ కనిష్ఠ లోన్ వాల్యూ- రూ. 5వేలు
- ఎఫ్‌డీలపై ఆన్లైన్ ఓవర్‌డ్రాఫ్ట్ గరిష్ఠ లోన్ వాల్యూ- రూ. 5కోట్లు
- ఇంటర్నెంట్ బ్యాంకింగ్/ యోనో/ ఎస్బీఐ బ్రాంచీల్లో లోన్ పెట్టుకోవచ్చు
- సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఉన్న ఎస్బీ కస్టమర్లకు ఎఫ్‌డీలపై లోన్ లభిస్తుంది.
ఎస్బీఐలో.. ఎఫ్‌డీలపై లోన్ తీసుకోవడం ఎలా?
- How to take loan on FD : స్టెప్ 1:- ముందుగా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వాలి.
- స్టెప్ 2:- మెన్యూ సెక్షన్లో ఈ- ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆప్షన్ సెలక్ట్ చేయాలి.
- స్టెప్ 3:- 'ఓవర్‌డ్రాఫ్ట్ అగైనస్ట్ ఫిక్స్‌డ్ డిపాజిట్'ను సెలక్ట్ చేయాలి. ఓవర్‌డ్రాఫ్ట్ కోసం అప్లై చేయాలి.
- స్టెప్ 4:- 'ప్రొసీడ్' బటన్ మీద క్లిక్ చేయాలి. ఓవర్‌డ్రాఫ్ట్ అమోంట్, వడ్డీ రేటు, ఎక్స్పైరీ డేట్లను వెరిఫై చేయాల్సి ఉంటుంది.
- స్టెప్ 5:- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ టైప్ చేసి.. సెక్యూరిటీ పాస్వర్డ్ టైప్ చేయాలి.
సమీపంలోని ఎస్బీఐ బ్రాంచీలకు వెళ్లి కూడా తమ ఎఫ్‌డీలపై లోన్లు తీసుకోవచ్చు.
పెరిగిన ఎస్బీఐ వడ్డీ రేట్లు..
SBI bank FD interest rate : దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ రుణదాత, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన రేట్లు 13.08.2022 నుండి అమలులోకి వస్తాయని బ్యాంక్ వెబ్‌సైట్ పేర్కొంది. సవరించిన వడ్డీరేట్ల ప్రకారం.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై.. వాటి కాల వ్యవధులను బట్టి.. సాధారణ ప్రజలకు 2.90% నుండి 5.65% వరకు వడ్డీ లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 3.40% నుండి 6.45% వరకు వడ్డీ లభిస్తుంది. అలాగే, "SBI Wecare” డిపాజిట్ పథకంలో చేరిన వారికి మరో 0.30% ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అయితే, ఇది ఐదేళ్ల కాలపరిమితికి మించిన ఎఫ్‌డీలకు మాత్రమే వర్తిస్తుంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.