తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Spurious Drugs: నాణ్యత పరీక్షలో విఫలమైన 48 ఔషధాలు; నకిలీవిగా తేలిన మరో 5 మందులు

spurious drugs: నాణ్యత పరీక్షలో విఫలమైన 48 ఔషధాలు; నకిలీవిగా తేలిన మరో 5 మందులు

Sudarshan V HT Telugu

26 September 2024, 17:40 IST

google News
  • సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ సీడీఎస్సీవో ఇటీవల రెండు జాబితాలను విడుదల చేసింది. వాటిలో ఒక జాబితాలో నాణ్యత పరీక్షల్లో విఫలమైన 48 మందుల పేర్లు ఉన్నాయి. మరో లిస్ట్ లో 2024 ఆగస్టులో నకిలీ లేదా కల్తీ అని గుర్తించిన ఐదు ఔషధాల పేర్లు ఉన్నాయి. five drugs declared as “Spurious/Adulterated/Misbranded”

నాణ్యత పరీక్షలో విఫలమైన 48 ఔషధాలు
నాణ్యత పరీక్షలో విఫలమైన 48 ఔషధాలు (HT_PRINT)

నాణ్యత పరీక్షలో విఫలమైన 48 ఔషధాలు

సాధారణంగా వివిధ ఆరోగ్య సమస్యలకు వాడే 50 మందులు నాసిరకంగా ఉన్నట్లు ఈ ఏడాది ఆగస్టులో గుర్తించారు. ఈ మందులు నాణ్యత ప్రమాణాలకు లోబడి లేవని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) తెలిపింది. ఈ జాబితాలో యూనిక్ బ్యాచ్ నంబర్లు, తయారీ తేదీలతో కూడిన 48 ఔషధాల పేర్లు ఉన్నాయి.

బీపీ, షుగర్, కాల్షియం మందులు..

పాన్-డి, పారాసిటమాల్, రక్తపోటు (BP) కి వాడే మందులు, యాంటీ డయాబెటిస్ మందులు, విటమిన్లు, కాల్షియం సప్లిమెంట్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్న కొన్ని ప్రసిద్ధ మందులు. ఈ ఉత్పత్తులను యూనిక్యూర్ ఇండియా లిమిటెడ్, హెటిరో డ్రగ్స్, హెల్త్ బయోటెక్ లిమిటెడ్, అల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ (HAL), లైఫ్ మ్యాక్స్ క్యాన్సర్ లేబొరేటరీస్, ప్యూర్ & క్యూర్ హెల్త్ కేర్, మెగ్ లైఫ్ సైన్సెస్ తో సహా పలు కంపెనీలు తయారు చేశాయి.

రెండు లిస్ట్ లు

క్వాలిటీ పరీక్షల్లో ఫెయిల్ అయిన ఔషధాల పేర్లతో రెండు జాబితాలను సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ విడుదల చేసింది. అవి ఒకటి నాణ్యత పరీక్షల్లో విఫలమైన 48 మందుల జాబితా, మరొకటి 2024 ఆగస్టులో నకిలీ ఔషధాలుగా తేలిన ఐదు మందుల పేర్లు ఉన్న జాబితా.

"నకిలీ/కల్తీ/తప్పుడు బ్రాండెడ్"గా ప్రకటించిన ఔషధాల జాబితా

  • పల్మిసిల్ (Pulmosil) (సిల్డెనాఫిల్ ఇంజెక్షన్)
  • పాంటోసిడ్ (Pantocid) (పెంటాప్రజోల్ టాబ్లెట్స్ IP)
  • ఉర్సోకాల్ 300 (Ursocol 300) (ఉర్సోడాక్సిక్ ఓలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఐపి)
  • టెల్మా హెచ్ (Telma H) (టెల్మిసార్టన్ 40 మి.గ్రా మరియు హైడ్రోక్లోరోట్ హైజైడ్ 12.5 మి.గ్రా టాబ్లెట్స్ IP)
  • డెఫ్లాజకార్ట్ (Deflazacort Tablets) (Defcort 6 Tablets)

"ప్రామాణిక నాణ్యత లేదు" అని సిడిఎస్సిఓ ప్రకటించిన 48 మందుల పూర్తి జాబితా ఇది.

1. Amoxicillin And Potassium Clavulanate Tablets IP (Clavam 625)

2. Amoxycillin & Potassium Clavulanate Tablets (Mexclav 625)

3. Calcium And Vitamin D3 Tablets IP Shelcal 500 (Shelcal)

4. Metformin Hydrochloride Sustained-release Tablets IP (Glycimet-SR-500

5. Vitamin B Complex with Vitamin C Softgels

6. Rifmin 550 (Rifaximin Tablets 550 mg)

7. Pantoprazole Gastro-Resistant and Domperidone Prolonged-Release Capsules IP (Pan-D)

8. Paracetamol Tablets IP 500 mg

9. Montair LC Kid (Montelukast Sodium & Levocetirizne Hydrochloride Dispersible Tablets)

10. Compound Sodium Lactate Injection I.P. (Ringer Lactate

Solution for Injection) (RL 500 ml)

11. Fexofenadine Hydrochloride Tablets IP 120 mg

12. Fexofenadine Hydrochloride Tablets IP 120 mg

13. Laxnorm Solution (Lactulose Solution USP)

14. Heparin Sodium Injection 5000 Units (Hostranil Injection)

15. Buflam Forte Suspension (Ibuprofen & Paracetamol Oral Suspension)

16. Cepodem XP 50 Dry Suspension (Cefpodoxime Proxetil and Potassium Clavulanate Oral Suspension)

17. Nimesulide, Paracetamol and Chlorzoxazone Tablets (NICIP MR)

18. Rolled Gauze (Non-Sterilized)

19. Ciprofloxacin Tablets I.P. 500 mg (Ocif-500)

20. Nimesulide, Phenylephrine Hydrochloride & Levocetirizine Dihydrochloride Tablets (Nunim-Cold)

21. Adrenaline Injection I.P. Sterile 1 ml

22. Compound Sodium Lactate Injection I.P. (Ringer Lactate Solution for Injection) RL 500ml

23. Vingel XL Pro Gel (Diclofenac Diethylamine, Linseed Oil, Methyl Salicylate and Menthol Gel)

24. Atropine Sulphate Injection IP 2 ml

25. Cefoperazone & Sulbactam For Injection (Todaycef 1.5 G)

26. Heparin Sodium Injection IP 25000 IU / 5ml

27. Cefepime & Tazobactam for Injection (Crupime - TZ Kid Injection)

28. Atropine Sulphate Injection I.P. (Atropine Sulphate)

29. Atropine Sulphate Injection I.P. (Atropine Sulphate)

30. Atropine Sulphate Injection I.P. (Atropine Sulphate)

31. Atropine Sulphate Injection I.P. (Atropine Sulphate)

32. Salbutamol, Bromhexine HCI, Guaifenesin and Mentho Syrup(Acozil Expectorant)

33. Diclofenac Sodium IP

34. Escitalopram and Clonazepam Tablets IP (Klozaps-ES Tablets)

35. Phenytoin Sodium Injection USP

36. Paracetamol, Phenylephrine Hydrochloride and Cetirizine Hydrochloride Suspension (Cethel Cold DS Suspension)

37. Calcium 500 mg with Vitamin D3 250 IU Tablets IP

38. Amoxycillin and Potassium Clavulanate Tablets IP 625 mg (Renamega- CV 625)

39. Olmesartan Medoxomil Tablets IP 40 mg

40. INFUSION SET-NV

41. Telmisartan Tablets IP 40 mg

42. Telmisartan Tablets IP 40 mg

43. Telmisartan Tablets IP 40 mg

44. Telmisartan Tablets IP 40 mg

45. Alprazolam Tablets IP 0.25 mg (Erazol-0.25 Tablets)

46. GLIMEPIRIDE TABLETS IP (2 mg)

47. Calcium and Vitamin D3 Tablets I.P.

48. Metronidazole Tablets IP 400mg

తదుపరి వ్యాసం