GST council meeting: 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత పలు వస్తువులు, సేవలపై పన్ను తగ్గింపును జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. తగ్గించిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇకపై చౌకగా లభించే వస్తువుల జాబితా ఇక్కడ ఉంది.
1. క్యాన్సర్ మందులు: కేన్సర్ చికిత్సకు ఉపయోగించే ట్రాస్టుజుమాబ్ డెరుక్స్టెకాన్ (Trastuzumab Deruxtecan), ఒసిమెర్టినిబ్ (, Osimertinib), డర్వాల్యుమాబ్ (Durvalumab) వంటి ఔషధాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
2. నమ్కీన్లు, రుచికరమైన ఆహార ఉత్పత్తులు: నమ్కీన్, రుచికరమైన ఆహార ఉత్పత్తులపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. ఫ్రై చేయని లేదా వండని స్నాక్ పెల్లెట్స్ పై 5 శాతం జీఎస్టీ రేటు కొనసాగుతుంది.
హెలికాప్టర్ ప్రయాణం: మతపరమైన, ఆధ్యాత్మిక పర్యటనల కోసం చేసే హెలికాప్టర్ ప్రయాణాలపై జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గించారు. కేదార్ నాథ్ (KEDARNATH), బద్రీనాథ్ వంటి మతపరమైన పర్యటనల్లో ఉపయోగించే హెలికాప్టర్ సేవలపై పన్నును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
4. కారు, మోటారుసైకిల్ సీట్లు: 9401 కంటే తక్కువ స్థాయిలో వర్గీకరించిన కారు సీట్లపై జీఎస్టీ (GST) రేటును 18 శాతం నుండి 28 శాతానికి పెంచారు. మోటారు కార్ల కార్ల సీట్లకు 28% యూనిఫామ్ రేటు వర్తిస్తుంది.