షావోమీ నుంచి కొత్త 4కె స్మార్ట్‌టీవీలు.. సూపర్ పిక్చర్ క్వాలిటీ.. అదిరిపోయే సౌండ్ క్లారిటీ-xiaomi pro qled series 4k smart tvs launched in india price starting at 29999 rupees know features and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  షావోమీ నుంచి కొత్త 4కె స్మార్ట్‌టీవీలు.. సూపర్ పిక్చర్ క్వాలిటీ.. అదిరిపోయే సౌండ్ క్లారిటీ

షావోమీ నుంచి కొత్త 4కె స్మార్ట్‌టీవీలు.. సూపర్ పిక్చర్ క్వాలిటీ.. అదిరిపోయే సౌండ్ క్లారిటీ

Anand Sai HT Telugu
Aug 27, 2024 04:00 PM IST

Xiaomi X Pro QLED Launched in India : షావోమీ తన నూతన టీవీ సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. చాలా కాలం తర్వాత ఈ బ్రాండ్ ప్రీమియం టీవీని ప్రవేశపెట్టింది. ఈ టీవీలు కొన్ని ప్రీమియం ఫీచర్లతో మూడు సైజుల్లో లభిస్తాయి. షావోమీ తీసుకొచ్చిన కొత్త టీవీల ధర ఎంత? ఫీచర్లు ఏంటీ తెలుసుకుందాం..

షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్‌ఈడీ సిరీస్‌ టీవీలు
షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్‌ఈడీ సిరీస్‌ టీవీలు

షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్‌ఈడీ సిరీస్‌తో టీవీలను భారతదేశంలో లాంచ్ చేసింది. 43, 55, 65 మోడల్‌లలో షావోమీ 4కె స్మార్ట్ టీవీ సిరీస్‌లను విడుదల చేసింది. ఈ టీవీల్లో ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఈ బ్రాండ్ ప్రీమియం టీవీని ప్రవేశపెట్టింది. దీన్ని షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ సిరీస్‌గా పిలుస్తున్నారు. ఈ టీవీలు కొన్ని ప్రీమియం ఫీచర్లతో మూడు వేరియంట్లలో వస్తాయి. వినియోగదారులకు గొప్ప వీక్షణ అనుభవాన్ని, మంచి ఆడియో, స్టోరేజ్‌ను అందిస్తాయి. ఈ టీవీల ధర, అన్ని ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకోండి..

టీవీల ధరలు

షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ సిరీస్‌కు చెందిన 43 అంగుళాల టీవీని రూ.29,999కు, 55, 65 అంగుళాల వేరియంట్లను వరుసగా రూ.44,999, రూ.62,999కు కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 30 నుంచి దేశవ్యాప్తంగా Mi.com, అమెజాన్, ఫ్లిప్కార్ట్, షియోమీ స్టోర్లలో ఈ మూడు టీవీలు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌లో పొందుతారు.

కొత్త టీవీల ఫీచర్లు

షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ సిరీస్ 43, 55, 65 అంగుళాల స్క్రీన్ సైజుల్లో లాంచ్ అయింది. మంచి వీక్షణ అనుభవం కోసం డిస్ ప్లే చుట్టూ మూడు వైపులా అల్ట్రా-థిన్ బెజెల్స్ ఉన్నాయి. ఈ మూడు మోడళ్లలో వీడియో చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. లోతైన కాంట్రాస్ట్ స్థాయిలను అందించడానికి క్యూఎల్ఈడీ టెక్నాలజీని కలిగి ఉన్నాయి.

ఈ టీవీలు హెచ్‌డీఆర్ 10+, డాల్బీ విజన్ మద్దతుతో 4కె రిజల్యూషన్‌ను అందిస్తాయి. కచ్చితమైన, నిజమైన కలర్ కనిపించేందుకు వివిడ్ పిక్చర్ ఇంజిన్ ఉంది. ఈ టీవీలు ఎంఈఎంసీ సపోర్ట్, ఏఎల్ఎం మోడ్‌తో వస్తాయి. ఆడియో విషయానికొస్తే షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ సిరీస్‌లో డాల్బీ ఆడియో, డీటీఎస్:ఎక్స్‌తో డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. ఇవి 30 వాట్ సౌండ్ అవుట్‌పుట్‌ను ఇస్తాయి. సినిమాటిక్ ఆడియో అనుభవాన్ని అందిస్తాయని కంపెనీ పేర్కొంది. డిజైన్ పరంగా ఈ టీవీలు ప్రీమియం మెటాలిక్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటాయి.

ఎక్స్ సిరీస్ ధరలు

మరోవైపు షావోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ 43-అంగుళాల ధర రూ. 24,999 నుండి ప్రారంభమవుతుంది. 50-అంగుళాల వేరియంట్ ధర రూ.31,999, 55-అంగుళాల ధర రూ.35,999గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు కంపెనీ రూ. 2,000 తగ్గింపును కూడా అందిస్తోంది.