తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Anil Firojiya Weight Loss : నితిన్​ గడ్కరీ 'ఛాలెంజ్'​తో బరువు తగ్గిన బీజేపీ ఎంపీ.!

Anil Firojiya weight loss : నితిన్​ గడ్కరీ 'ఛాలెంజ్'​తో బరువు తగ్గిన బీజేపీ ఎంపీ.!

Sharath Chitturi HT Telugu

18 October 2022, 8:39 IST

google News
    • Anil Firojiya weight loss : నితిన్​ గడ్కరీ విసిరిన ఛాలెంజ్​తో ఓ బీజేపీ ఎంపీ ఏకంగా 32కేజీలు తగ్గారు. దీని వెనుక ఓ కథ ఉంది. అదేంటంటే..
నితిన్​ గడ్కరీ ఛాలెంజ్​తో బరువు తగ్గిన బీజేపీ ఎంపీ.!
నితిన్​ గడ్కరీ ఛాలెంజ్​తో బరువు తగ్గిన బీజేపీ ఎంపీ.! (twitter)

నితిన్​ గడ్కరీ ఛాలెంజ్​తో బరువు తగ్గిన బీజేపీ ఎంపీ.!

Anil Firojiya weight loss : ఈ ఏడాది ఫిబ్రవరి​ నెలలో మధ్యప్రదేశ్​ ఉజ్జెయిన్​లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ పాల్గొన్నారు. 'మీరు బరువు తగ్గాలి. తగ్గిన ప్రతీ కేజీకి ఉజ్జెయిన్​ అభివృద్ధి కోసం రూ. 1000కోట్లు మంజూరు చేస్తాము,' అని ఆ నియోజకవర్గం ఎంపీ అనిల్​ ఫిరోజియాతో అన్నారు.

"ఉజ్జెయిన్​ అభివృద్ధికి నిధులు కేటాయించాలంటే.. ఫిరోజియాజీకి నేను ఒక షరతు పెట్టాను. ఒకప్పుడు నా బరువు 135కేజీలుగా ఉండేది. ఇది ఫిరోజియా కన్నా ఎక్కువే. కానీ ఇప్పుడు నేను 93 కేజీలు ఉన్నాను. పాత ఫొటోల్లో నన్ను గుర్తుపట్టడం కష్టం. వాటిని ఆయనకు చూపించాను. ఆయన తగ్గిన ప్రతీ కేజీకి రూ. 1000కోట్ల నిధులను కేటాయిస్తాను," అని నితిన్​ గడ్కరీ తెలిపారు.

Anil Firojiya BJP MP : ఈ మాటను అనిల్​ ఫిరోజియా చాలా సీరియస్​గా తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 32కేజీలు తగ్గారు!

"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిట్​ ఇండియా ఉద్యమాన్ని లాంచ్​ చేశారు. నేను తగ్గిన ప్రతీ కేజీకి.. ఉజ్జెయిన్​ అభివృద్ధి కోసం రూ. 1000కోట్లు మంజూరు చేస్తామని స్టేజీ మీద నితిన్​ గడ్కరీ అన్నారు. నేను ఆ ఛాలెంజ్​ తీసుకుని 32కేజీలు తగ్గాను. ఇంకా తగ్గుతాను. నా నియోజకవర్గానికి నిధులు వస్తాయంటే.. ఇంకా తగ్గుతాను," అని అనిల్​ ఫిరోజియా తెలిపారు.

32కేజీలు ఎలా తగ్గారు?

"ఉదయాన్నే 5:30కి లేస్తాను. రన్నింగ్​, వ్యాయామం, యోగా చేస్తాను. ఆయుర్వేదంతో కూడిన డైట్​ను పాటిస్తాను. బ్రేక్​ఫాస్ట్​ తక్కువ తీసుకుంటాను. లంచ్​, డిన్నర్​ కోసం సలాడ్​, పచ్చి కూరగాయలు తింటాను. ఒక రోటీ తింటాను. అప్పుడప్పుడు క్యారెట్​ సూప్​, డ్రై ఫ్రూట్స్​ తీసుకుంటాను," అని అనిల్​ వెల్లడించారు.

Anil Firojiya Nithin Gadkari : ఇప్పుడు ఆ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అనిల్​ ఫిరోజియా ఫొటోలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా.. ఈ నెల 14న నితిన్​ గడ్కరీని కలిశారు బీజేపీ ఎంపీ అనిల్​ ఫిరోజియా. బరువు తగ్గిన విషయాన్ని వెల్లడించారు. సంతోషించిన నితిన్​ గడ్కరీ.. ఉజ్జెయిన్​ అభివృద్ధి కోసం రూ. 2,300కోట్లు విడుదల చేస్తానని హామీనిచ్చినట్టు తెలుస్తోంది.

తదుపరి వ్యాసం