మూడేళ్లల్లో రూ. 1లక్షను .. రూ. 61లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్..!
21 May 2022, 10:10 IST
- స్టాక్ మార్కెట్లోని మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ ఒకటి. ఈ స్టాక్.. మూడేళ్లల్లో అద్భుత రిటర్నులు ఇచ్చింది. రూ. లక్షను ఏకంగా రూ. 61లక్షలుగా మార్చేసింది.
మల్టీబ్యాగర్ స్టాక్.. మూడేళ్లలలో 61 రెట్లు పెరిగిన షేరు విలువ
Adani green energy share news | గత కొంతకాలంగా.. అదానీ స్టాక్స్ వార్తల్లో నిలుస్తున్నాయి. మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో అదానీ సంస్థలకు చెందిన షేర్లు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిలో ఆదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ ఒకటి. ఈ స్టాక్.. మూడేళ్ల కాలంలో రూ. 37.40 నుంచి ఏకంగా రూ. 2,279కు పెరిగింది. అంటే మూడేళ్ల క్రితం పెట్టుబడి పెట్టిన మదుపర్లకు ఏకంగా 6000శాతం రిటర్నులు తెచ్చిపెట్టింది ఈ మల్టీబ్యాగర్ అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్.
ఈ అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్.. నెల రోజులుగా కన్సాలిడేషన్ మోడ్‌లో ఉంది. నెల రోజుల వ్యవధిలో రూ. 2,280 నుంచి రూ. 2,279కు దిగొచ్చింది. కానీ 2022 నుంచి పోల్చుకుంటే.. ఇప్పటివరకు మంచి రిటర్నులే ఇచ్చింది. జనవరిలో రూ. 1347గా ఉన్న అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్.. ప్రస్తుతం రూ. 2279 వద్ద ఉంది. అంటే 70శాతం పెరిగినట్టు. ఇక ఏడాది కాలంతో పోల్చుకుంటే.. 75శాతం రిటర్నులు ఇచ్చింది.
2019 మే 17న.. ఈ మల్టీబ్యాగర్ స్టాక్.. రూ. 37.40 వద్ద ఉండేది. అంటే మూడేళ్లల్లో ఈ స్టాక సంపదన 61రెట్లు పెరిగినట్టు!
రూ. 1లక్షతో.. రూ. 61లక్షలు..!
నెల ముందు.. అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్‌లో రూ. 1లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ. 80వేలుగా ఉండేది. అదే 2022 తొలినాళ్లల్లో రూ. లక్ష పెడితే.. ఇప్పుడది రూ. 1.70లక్షలు అయ్యేది. ఏడాది క్రితం.. ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టి ఉంటే.. ఇప్పుడది రూ. 1.75లక్షలుగా అయ్యేది.
Multibgger stock news | అదే మూడేళ్ల క్రితం.. అంటే.. అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ రూ. 37.40గా ఉన్నప్పుడు.. రూ. లక్ష పెట్టి ఉంటే.. ఇప్పుడది ఏకంగా రూ. 61లక్షలు అయ్యేది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి.. అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాపిటల్ రూ. 3,60,153కు చేరింది. ప్రస్తుతం అదానీ గ్రీన్ ఎనర్జ బుక్ వాల్యూ.. షేరుకు 16.62గా ఉంది.
మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను గుర్తించడం ఎలా?
మల్టీబ్యాగర్ స్టాక్.. ఈ పేరు వింటే చాలు.. ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు ఎక్కడ లేని జోష్ వచ్చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే మల్టీబ్యాగర్ స్టాక్స్ కూడా తక్కువ సమయంలోనే అధిక లాభాలను తెచ్చిపెడతాయి. అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాలని చాలా మంది భావిస్తుంటారు. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు! ముఖ్యంగా కొత్తగా మార్కెట్లోకి వచ్చినవారు.. మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను పసిగట్టేందుకు చాలా కష్టపడుతూ ఉంటారు. సోషల్ మీడియా, టీవీ న్యూస్ ఛానెళ్లల్లో చెప్పినా.. మనం పెట్టుబడులు పెట్టేసరికి.. వాటి పరుగు నెమ్మదించిపోతుంది. ఒక్కోసారి అక్కడి నుంచి కిందపడిపోతూ ఉంటాయి. మరి ఓ స్టాక్‌కు.. మల్టీబ్యాగర్ గుర్తింపు రాకముందే ఎలా పసిగట్టొచ్చు? తద్వారా మంచి లాభాలను ఎలా ఆర్జించవచ్చు? అన్నవి ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ స్టాక్.. మల్టీబ్యాగర్‌గా మారేందుకు అనేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకు ఐఆర్సీటీసీ.. ఓ మల్టీబ్యాగర్ స్టాక్. మార్కెట్లో ఐఆర్సీటీసీకి గుత్తాధిపత్యం ఉండటమే ఇందుకు కారణం. ఇదే విధంగా.. మరికొన్ని కీలక విషయాలు ఉన్నాయి. అవేంటంటే..
ఆర్ఓసీఈ
Multibagger stocks India | ఆర్ఓసీఈ అంటే.. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సింపుల్‌గా చెప్పాలంటే.. సంస్థలో పెట్టిన మూలధనానికి ఎంత రిటర్న్ వస్తోంది? అనే విషయాన్ని లెక్కించడం. ఆర్ఓసీఈ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది.
ఓ కంపెనీ.. ఎప్పటికప్పుడు ఆదాయాన్ని పెంచుకుంటూపోతుంటే.. అది మంచి విషయమే. అయితే.. ఆర్ఓసీఈ తగ్గకుండా.. ఎప్పటికప్పుడు ఆదాయం పెంచుకుంటున్న కంపెనీల షేర్లు.. మల్టీబ్యాగర్లుగా మారే అవకాశం ఉంది.
క్యాష్ ఫ్లో
కంపెనీ కార్యకలాపాలను సాగించేందుకు నిధులను ఎంత మేర పంపిస్తున్నామో చెప్పేదే క్యాష్ ఫ్లో. భవిష్యత్తులో.. కంపెనీకి ఆదాయం పెరుగుతుందా? లేదా? అన్నది ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లు చెబుతాయి. మాటిమాటికి కంపెనీలోకి క్యాష్ ఫ్లో అవుతూ ఉంటే.. కార్యకలాపాల నుంచి వచ్చిన ఆదాయం.. కంపెనీ ఖర్చులకు సరిపోవడం లేదని అర్థం. అదే జరిగితే.. ఆ కంపెనీ తరచూ అప్పులు చేస్తూ ఉండాలి. లేకపోతే ఈక్వీటీనైనా అమ్ముకోవాల్సి ఉంటుంది.
మల్టీబ్యాగర్ కంపెనీలు.. లాభాలతో పాటు ఆపరేటింగ్ క్యాష్‌ఫ్లోలను కాంపౌండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. తద్వారా.. భవిష్యత్తులో ఇతర సంస్థల కన్నా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం వీటికి ఉంటుంది.
అయితే.. ఇక్కడ ఒక సమస్య ఉంది. కంపెనీ క్యాష్ ఫ్లోలు, ఆదాయాలు ఎక్కువగానే ఉన్నా.. కొన్నిసార్లు అభివృద్ధి పరంగా అవి నెమ్మదిస్తూ ఉంటాయి(ఉదా- కొత్త కస్టమర్లను ఆకట్టుకోలేకపోతే..). వాటిల్లో పెట్టుబడులకు మంచి రిటర్నులు రాకపోవచ్చు.
నిధుల కేటాయింపులు..
Multibaggar stocks meaning | మల్టీబ్యాగర్ కంపెనీలకు అంచనాలకు మించిన ఫ్రీ క్యాష్ ఉంటుంది. అంటే మంచి ఆదాయాలు వస్తుంటాయి. ఆర్ఓసీఈ చాలా బాగా ఉంటుంది. అదే సమయంలో క్యాష్ ఫ్లోలు కూడా సంస్థ అభివృద్ధికి తగ్గట్టుగానే ఉంటాయి. కానీ ఇలా ఉన్న కంపెనీలన్నీ మల్టీబ్యాగర్లు కాలేవు. దానికి ముఖ్యకారణం.. నిధుల కేటాయింపు.
నిధుల కేటాయింపుతోనే మంచి కంపెనీకి.. మల్టీబ్యాగర్ కంపెనీకి మధ్య ఉన్న వ్యత్యాసం తెలిసిపోతుంది. నిధులను సక్రమంగా వినియోగించి మరింత ఆదాయాన్ని జెనరేట్ చేయగలిగే సంస్థలకు మల్టీబ్యాగర్లుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కొన్ని కంపెనీలు.. పెట్టుబడుల్లో తీసుకునే తప్పుడు నిర్ణయాల కారణంగా డీలా పడుతూ ఉంటాయి. తద్వారా.. మిగిలినవి అన్నీ సరిగ్గా ఉన్నా.. మల్టీబ్యాగర్ గుర్తింపు తెచ్చుకోలేకపోతాయి.
కంపెనీల పర్ఫార్మెన్స్లను పరిశీలించేందుకు వివిధ వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.