ప్రస్తుత పరిస్థితుల్లోనూ.. నెల రోజుల్లోనే 150శాతం పెరిగిన స్టాక్!
2022 multibagger stocks | 2022 మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో టైన్ ఆగ్రో ఒకటి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు పడుతున్నా.. ఈ సంస్థ షేర్లు.. నెల రోజుల్లో 15ంశాతం పెరగడం విశేషం.
Multibagger stocks 2022 | రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు దారుణంగా పతనమవుతున్నాయి. దేశీయ సూచీలు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. మదుపర్లు తీవ్ర నష్టాల్లోకి జారుకుంటున్నారు. అయితే ఈ క్లిష్టపరిస్థితుల్లోనూ కొన్ని సంస్థల షేర్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నాయి. మంచి రిటర్నులు తెచ్చిపెడుతున్నాయి. వీటిల్లో టైన్ ఆగ్రో ఒకటి. ఈ సంస్థ షేర్లు.. నెల రోజుల్లో 150శాతం పెరిగాయి.
టైన్ ఆగ్రో అనేది ఓ టెక్స్టైల్ సంస్థ. 2022 మల్టీ బ్యాగర్ స్టాక్స్‌లో ఇదొకటి. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ సంస్థ షేర్లు 685శాతం పెరిగాయి. రూ. 7.14 నుంచి రూ. 56.05కి చేరాయి. ఫలితంగా ఇందుల పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు దక్కుతున్నాయి.
గత 5 ట్రేడింగ్ సెషన్స్‌లో ఈ మల్టీ బ్యాగర్ స్టాక్ దుమ్మురేపింది. వరుసగా అప్పర్ సర్క్యూట్లకు చేరింది. ఫలితంగా 21.50శాతం రిటర్నులు తెచ్చిపెట్టింది.
Multibagger stock | అదే సమయంలో.. నెల రోజుల వ్యవధిలో రూ. 22.65 నుంచి రూ. 56.05కి చేరింది. అంటే 30రోజుల్లో ఏకంగా 150శాతం పెరిగినట్టు! ఈ నెల రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 9శాతం, నిఫ్టీ 50 సుమారు 10శాతం పడింది. ఈ లెక్కన చూసుకుంటే.. 2022 మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటైన టైన్ ఆగ్రో షేర్లు అద్భుత ప్రదర్శన చేసినట్టే.
గమనిక: ఇది పూర్తిగా సమాచారం కోసం రాసిన కథనం మాత్రమే. మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్తో సంప్రదించిన తర్వాతే ఎలాంటి పెట్టుబడులైనా పెట్టడం శ్రేయస్కరం.
సంబంధిత కథనం