రెండేళ్లల్లో 1,500శాతం పెరిగిన స్టాక్.. ఇప్పుడు ఛాన్స్ ఉందా?
Multibagger stock | 2021 మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటైన క్వాలిటీ ఫార్మా.. రెండేళ్లల్లో 1,500శాతం పెరిగింది. రెండేళ్ల ముందు రూ. లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడది రూ. 16లక్షలు అయ్యేది.
2021 Multibagger stock | కొవిడ్ సంక్షోభంలోనూ పలు కంపెనీల స్టాక్స్ మల్టీబ్యాగర్‌గా మారాయి. మంచి రిటర్నులు ఇచ్చి మదుపర్లును సంతోషపెట్టాయి. ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో క్వాలిటీ ఫార్మా కూడా ఒకటి. 2021 మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఇదొకటి. రెండేళ్లల్లో(2022 మార్చి 17 నాటికి) రూ. 25.55 నుంచి రూ. 404.55కు పెరిగింది.
ఆరు నెలలుగా ఆ మల్టీబ్యాగర్ స్టాక్ అమ్మకాల ఒత్తిడికి గురవుతోంది. నెల రోజుల వ్యవధిలో స్టాక్ ప్రైజ్ రూ. 454.25 నుంచి రూ. 404.55కి పడిపోయింది. ఆరు నెలల్లో రూ. 593 నుంచి రూ. 404కు దిగొచ్చింది.
ఇక ఏడాది కాలంలో మాత్రం క్వాలిటీ ఫార్మా స్టాక్ రూ. 52.10 నుంచి రూ. 404.55కి పెరిగింది. అంటే 675శాతం పైకి వెళ్లినట్టు. అయితే రెండేళ్లల్లో స్టాక్ ధర భారీగా వృద్ధి చెందింది.
రూ. లక్షకు రూ. 16లక్షలు..
క్వాలిటీ ఫార్మాలో నెల ముందు రూ. లక్ష పెట్టి ఉంటే ఇప్పుడది రూ. 89వేలు అయ్యుండేది. అదే ఆరు నెలల ముందు అదే మొత్తం పెట్టి ఉంటే రూ. 70వేలకు వచ్చేది. కానీ దీర్ఘకాలంలో ఈ స్టాక్ అద్భుత ప్రదర్శన ఇచ్చింది.
ఏడాది ముందు ఈ మల్టీబ్యాగర్ క్వాలిటీ ఫార్మా స్టాక్‌లో రూ. లక్ష పెట్టి ఉంటే ఇప్పుడది రూ. 7.75లక్షలు అయ్యేది. ఇక రెండేళ్ల ముందు.. స్టాక్ ధర రూ. 25.55 దగ్గర ఉన్నప్పుడు లక్ష రూపాయలు పెట్టిన మదుపరుడికి.. ఇప్పుడు ఏకంగా రూ. 16లక్షలు అందేవి.
ఇప్పుడు ఛాన్స్ ఉందా?
కొన్ని కంపెనీల షేర్లు ఎలాంటి బలమైన కారణాలు లేకుండానే భారీగా పెరుగుతాయి. మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత పెట్టుబడులు పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారం కోసం ప్రచురించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి పెట్టుబడులైనా చేసేముందు ఫైనాన్షియల్ ఎడ్వైజర్‌ను సంప్రదించడం శ్రేయస్కరం.
సంబంధిత కథనం
టాపిక్