Aadhaar card : మన ఆధార్ నెంబర్ తెలుసుకుని ఇతరులు మోసాలకు పాల్పడే అవకాశం ఉందా?
18 February 2024, 19:00 IST
- Aadhaar card FAQ's : ఆధార్ కార్డు చుట్టూ అనేక సందేహాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఆధార్ నెంబర్‌తో ఎవరైనా మనల్ని మోసం చేయవచ్చా? వంటివి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. వీటికి సమాధానాలను ఇక్కడ తెలుసుకోండి..
మన ఆధార్ నెంబర్‌తో ఇతరులు మోసాలకు పాల్పడే అవకాశం ఉందా?
Aadhaar card questions and answers in Telugu : దేశంలో అత్యవసరమైన విషయాల్లో ఆధార్ కార్డు ఒకటి. నిజం చెప్పాలంటే.. ఆధార్ కార్డు లేకపోతే దాదాపు ఏ పనీ జరగదు! గ్యాస్ బుకింగ్ నుంచి టికెట్ బుకింగ్ వరకు.. దేనికైనా ఆధార్ కచ్చితంగా ఉండాల్సిందే. ఇంతటి ముఖ్యమైన ఆధార్ కార్డుతో మోసాలు జరిగితే? మన ఆధార్ నెంబర్‌తో ఎవరైనా మోసాలకు పాల్పడితే? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై.. యూఐడీఏఐ (యునీక్ ఐడెన్టిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) స్పందించింది. పలు ఎఫ్ఏక్యూలను విడుదల చేసింది. వాటిల్లో కొన్నింటిని ఇక్కడ చూద్దాము..
ఆధార్ కార్డు- ప్రశ్నలు.. సమాధానాలు..!
1. బ్యాంక్ అకౌంట్, పాన్‌తో పాటు ఇతర సేవలకు ఆధార్‌ని లింక్ చేస్తే.. నేను మోసానికి గురయ్యే అవకాశం పెరుగుతందా?
Aadhar card query : సమాధానం:- అలా ఏం లేదు. అకౌంట్ వివరాలను మీ బ్యాంక్ ఎవరికి చెప్పదు. ఆధార్ నెంబర్‌తో మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకోవడం అసాధ్యం. అంతేకాదు.. యూఐడీఏఐతో పాటు ఏ ఇతర సంస్థ వద్ద కూడా మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఉండవు. ఉదాహరణకు.. దాదాపు ప్రతి చోట మీ ఫోన్ నెంబర్ ఇస్తారు. మరి.. మీ టెలికాం సంస్థ దగ్గర మీ బ్యాంక్ వివరాలు ఉండవు కదా! ఇదీ అంతే!
2. నా ఆధార్ కార్డు ఉన్నా, ఆధార్ నెంబర్ ఉన్నా.. లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇతరులు తెలుసుకనే అవకాశం ఉందా? ఎవరైనా ఆధార్ కార్డు ఉన్న వారు.. మోసానికి గురయ్యారా?
Aadhaar card questions and answers : సమాధానం:- బ్యాంక్ అకౌంట్ నెంబర్ తెలిసినంత మాత్రానా.. అందులో నుంచి డబ్బులు డ్రా చేయలేరు కదా! అదే విధంగా.. ఆధార్ కార్డు నెంబర్ తెలిసినంత మాత్రాన.. అది లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ అకౌంట్ నుంచి ఎవరు డబ్బులు విత్‌డ్రా చేయలేరు. పిన్, ఓటీపీలు.. చాలా వ్యవహారాలు ఉంటాయి. ఆధార్ నెంబర్‌తో ఇప్పటివరకు ఎవరు మోసానికి గురవ్వలేదు.
3. మోసగాళ్లకు నా ఆధార్ నెంబర్ తెలిసి, దానితో నాకు తెలియకుండానే ఓ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దామని చూస్తే ఏం జరుగుతంది? నాకు నష్టం జరుగుతుందా?
సమాధానం:- పీఎంఎల్ రూల్స్ ప్రకారం.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే.. ఆధార్ నెంబర్ కచ్చితంగా ఉండాలి. అదే సమయంలో.. బ్యాంక్‌లు కేవైసీని పూర్తి చేయాలి. ఎవరైనా మోసగాళ్లు.. మీ ఆధార్ నెంబర్‌తో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, బ్యాంక్‌లు కేవైసీని పూర్తి చేయకపోతే, అది మీ తప్పు అవ్వదు. బ్యాంక్ తప్పు అవుతుంది. అయితే.. ఇప్పటివరకు ఎవరికి ఆర్థిక నష్టం జరగలేదు.
4. ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం.. నా ఆధార్ కార్డుని సర్వీస్ ప్రొవైడర్‌కి ఇచ్చాను. ఆధార్ నెంబర్ తెలిస్తే ఎవరైనా నాకు హానీ చేసే అవకాశం ఉందా?
Aadhaar card latest news : సమాధానం:- లేదు. మీ ఆధార్ కార్డు నెంబర్ తెలిసినంత మాత్రాన.. ఎవరు మిమ్మల్ని హాని చేయలేరు. పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లాగనే.. ఆధార్ కార్డు కూడా పనిచేస్తుంది.
5. ఆధార్ కోసం నేను అప్లై చేసుకున్నాను. కానీ రాలేదు. మళ్లీ అప్లై చేసుకున్నాను. మరి ఎప్పుడు వస్తుంది?
సమాధానం:- ఫస్ట్ ఎన్‌రోల్‌మెంట్‌తో మీ ఆధార్ జెనరేట్ అయ్యి ఉంటే.. ఆ తర్వాత ఎన్నిసార్లు ఎన్రోలింగ్కి ప్రయత్నించినా రిజెక్ట్ అవుతుంది. మళ్లీ, మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు.