‘Aadhaar Mitra’, UIDAI chatbot: ఆధార్ సమస్యలకు ‘ఆధార్ మిత్ర’తో చెక్
08 January 2024, 22:17 IST
- ‘Aadhaar Mitra’, UIDAI chatbot: ఆధార్ ఎన్ రోల్ మెంట్, ఆధార్ అప్ డేట్, ఆధార్ పీవీసీ కార్డ్.. తదితర విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నారా? మీ కోసమే UIDAI ‘ఆధార్ మిత్ర’ ను తీసుకువచ్చింది.
ప్రతీకాత్మక చిత్రం
‘Aadhaar Mitra’, UIDAI chatbot: The Unique Identification Authority of India (UIDAI) శుక్రవారం వినియోగదారుల సౌకర్యం కోసం చాట్ బాట్ ను ఆవిష్కరించింది. దానికి ఆధార్ మిత్ర అనే పేరు పెట్టింది. ఆధార్ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఈ ఆధార్ మిత్ర దృష్టికి తీసుకువెళ్లవచ్చు.
‘Aadhaar Mitra’, UIDAI chatbot: ఏంటీ ఆధార్ మిత్ర..?
ఇది UIDAI ప్రారంభించిన చాట్ ప్లాట్ ఫాం. ఆధార్ కు సంబంధించిన అనుమానాలు, సమస్యలకు సంబంధించిన ప్రశ్నలకు ఈ చాట్ బాట్ అటోమేటిక్ సమాధానాలు ఇస్తుంది. UIDAI వెబ్ సైట్ హోం పేజ్ లో ఇది అందుబాటులో ఉంటుంది. ‘ఆస్క్ ఆధార్’ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా దీన్ని యాక్టివేట్ చేయవచ్చు.
‘Aadhaar Mitra’, UIDAI chatbot: వెల్ ప్రొగ్రామ్డ్ చాట్ బాట్
ఇది ఆధార్ కు సంబంధించి ప్రజలకు వచ్చే అన్ని అనుమానాలు, సమస్యలు, ఇతర ప్రశ్నలతో పాటు, ఆధార్ అందించే సేవలకు సంబంధించిన పూర్తి సమాచారంతో ప్రొగ్రామ్ చేయబడిందని UIDAI వెల్లడించింది. ఆధార్ మిత్ర చాట్ బాక్స్ లో మన ప్రశ్నను టైప్ చేయగానే, సమాధానం వస్తుందని తెలిపింది.
‘Aadhaar Mitra’, UIDAI chatbot: హిందీ, ఇంగ్లీష్ ల్లో..
ప్రస్తుతం ఈ చాట్ సర్వీస్ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఇతర ప్రాంతీయ భాషల్లోనూ సేవలు అందించే ప్రయత్నంలో UIDAI ఉంది. ఆధార్ మిత్ర వినియోగదారుల ప్రశ్నలకు టెక్స్ట్ రూపంలోనే కాకుండా, వీడియోల రూపంలోనూ వారిలో అవగాహన కల్పిస్తుంది.
‘Aadhaar Mitra’, UIDAI chatbot: ఏయే సేవలు..
ప్రస్తుతం ఆధార్ మిత్ర ద్వారా పీవీసీ కార్డు స్టేటస్, ఆధార్ ఎన్ రోల్ మెంట్ వివరాలు, మీ దగ్గర్లోని ఎన్ రోల్ మెంట్ కేంద్రాల వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే, ఆధార్ కు సంబంధించి ఏవైనా ఫిర్యాదులున్నా, ఇక్కడ నమోదు చేయవచ్చు.
టాపిక్