FASTag KYC: ఫాస్టాగ్ కేవైసీ అప్ డేట్ లాస్ట్ డేట్ పొడగింపు.. ఇలా అప్ డేట్ చేసుకోండి..
FASTag KYC: టోల్ రోడ్లపై టోల్ ఫీజును చెల్లించడాన్ని సులభతరం చేసిన ఫాస్టాగ్ కేవైసీ ని అప్ డేట్ చేసుకునే గడవును పొడిగించారు. గతంలో ఈ గడువు జనవరి 31 వరకు ఉంది. గడువులోగా కేవైసీ అప్ డేట్ చేయని ఫాస్టాగ్ లు చెల్లవు.
FASTag KYC: ఫాస్ట్‌ట్యాగ్‌లలో నో యువర్ కస్టమర్ (KYC)ని అప్‌డేట్ చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గడువును పొడిగించింది. జనవరి 31 తో ముగిసిన గడువును మరో నెల పాటు పొడిగిస్తూ ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఫాస్టాగ్ కేవైసీలను ఫిబ్రవరి 29 లోపు అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 29 తరువా కేవైసీ అప్ డేట్ చేయని ఫాస్టాగ్ లను చెల్లనివిగా నిర్ధారిస్తారు.
2021 నుంచి..
ఆటోమేటిక్ టోల్ వసూలుతో పాటు టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నిరోధించడానికి ఫిబ్రవరి 15, 2021 నుండి అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) లను తప్పనిసరి చేశారు. ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు లేకుండా వాహనాలు వెళ్లడానికి వీలుగా NHAI 'ఒక వాహనం, ఒకే ఫాస్ట్‌ట్యాగ్' ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అంటే, ఒకే ఫాస్టాగ్ ను ఒకటి కన్నా ఎక్కువ వాహనాలకు వాడకుండా.. అలాగే, ఒకే వాహనానికి ఒకటికి మించిన ఫాస్టాగ్ లను వాడకుండా నిరోధించే లక్ష్యంతో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు.
1.27 కోట్ల ఫాస్టాగ్ లు..
జనవరి 31 గడువు కంటే ముందు భారతదేశం అంతటా జారీ చేయబడిన 1.27 కోట్లలో కేవలం ఏడు లక్షల బహుళ ఫాస్ట్‌ట్యాగ్‌లు మూసివేయబడ్డాయి. తదుపరి గడువు ముగిసేలోపు మిగిలిన FASTag ఖాతాలు మూసివేయబడతాయని NHAI ఆశిస్తోంది. ఫాస్ట్‌ట్యాగ్‌కు ప్రస్తుతం ఎనిమిది కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 1.27 కోట్ల ఫాస్టాగ్ లలో, జనవరి 31 లోపు ఏడు లక్షల మల్టిపుల్ ఫాస్టాగ్ లను రద్దు చేశారు. ఫిబ్రవరి 29 లోపు మిగతా మల్టిపుల్ ఫాస్టాగ్ లను కూడా రద్దు చేసే అవకాశం ఉంది.
Check FASTag KYC status: ఫాస్టాగ్ కేవైసీ ని ఇలా చెక్ చేసుకోండి..
మీ వాహనం ఫాస్టాగ్ కేవైసీని చెక్ చేసుకోవడం కోసం మొదట..
- ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్ సైట్ https://fastag.ihmcl.com ను ఓపెన్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్ వర్డ్ తో లాగిన్ కావాలి.
- ఓటీపీ ద్వారా కూడా లాగిన్ కావచ్చు.
- మై ప్రొఫైల్ (My Profile) ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ సమయంలో మీరు అప్ లోడ్ చేసిన డాక్యుమెంట్స్ వివరాలు అక్కడ కనిపిస్తాయి.
Update KYC: ఫాస్టాగ్ కేవైసీని ఇలా అప్ డేట్ చేసుకోండి
మీ ఫాస్టాగ్ కేవైసీని అప్ డేట్ చేయడం కోసం ముందుగా..
- ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్ సైట్ https://fastag.ihmcl.com ను ఓపెన్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్ వర్డ్ తో లాగిన్ కావాలి.
- మై ప్రొఫైల్ (My Profile) ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అందులో కేవైసీ సబ్ సెక్షన్ (KYC sub-section) లోకి వెళ్లాలి.
- కస్టమర్ టైప్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
- అవసరమైన ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి.
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను కూడా అప్ లోడ్ చేయాలి.
- సెల్ఫ్ డిక్లరేషన్ బాక్స్ ను టిక్ చేయాలి.
- కేవైసీని సబ్మిట్ చేయాలి.
required documents: ఈ డాక్యుమెంట్స్ అవసరం
ఫాస్టాగ్ కేవైసీని అప్ డేట్ చేసే ముందు కొన్ని డాక్యుమెంట్ల స్కాన్డ్ కాపీలను సిద్ధంగా ఉంచుకోండి. అవి వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (), పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ లేదా వోటర్ ఐడీ కార్డు. వీటిని సిద్ధంగా పెట్టుకున్న తరువాత ఫాస్టాగ్ కేవైసీని అప్ డేట్ చేయడం ప్రారంభించండి.