Texas earthquake : టెక్సాస్‌లో అత్యంత శక్తివంతమైన భూకంపం..!
17 December 2022, 9:29 IST
Texas earthquake today : టెక్సాస్‌లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై 5.4 తీవ్రత నమోదైంది.
టెక్సాస్‌లో శక్తివంతమైన భూకంపం..
Texas earthquake today : అమెరికా టెక్సాస్‌లో భూకంపం సంభవించింది. టెక్సాస్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటిగా దీనిని పరిగణిస్తున్నారు. చమురు ఉత్పత్తి కేంద్రాలు అధికంగా ఉండే పశ్చిమ టెక్సాస్ ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 5:35 గంటలకు.. భూకంపం సంభవించింది. మిడ్‌ల్యాండ్ ప్రాంతానికి ఉత్తర-వాయువ్యం వైపు 14 మైళ్ల దూరంలో భూమికి 8కి.మీల దిగువన భూ ప్రకంపనలను గుర్తించినట్టు యూఎస్ జీయోలాజికల్ సర్వే ప్రకటన విడుదల చేసింది. రిక్టార్ స్కేల్‌పై దాని తీవ్రత 5.4గా నమోదైంది. టెక్సాస్ చరిత్రలో ఇది 4వ అతిపెద్ద భూకంపం అని నేషనల్ వెథర్ సర్వీసెస్ పేర్కొంది.
ఈ భూకంపం తర్వాత.. మూడు నిమిషాలకు.. 3.3 తీవ్రతతో మళ్లీ భూ ప్రకంపనలు నమోదైనట్టు తెలుస్తోంది.
West Texas earthquake : టెక్సాస్‌లోని అమరిల్లో, అబిలెనె నుంచి న్యూ మెక్సికో కార్ల్స్‌బాద్ వరకు భూ ప్రకంపనలను గుర్తించారు. దాదాపు 1500మంది ప్రజలు.. భూప్రకంపనలతో భయపడ్డారు.
"ఇలాంటి ప్రాంతాల్లో భూకంపం వస్తే.. దాని తీవ్రత 100 మైళ్ల దూరం వరకు కూడా తెలుస్తుంది," అని యూఎస్జీఎస్ జాతీయ భూకంప సమాచార కేంద్రానికి చెందిన జియోఫిసిసిస్ట్ జన పుర్స్లే పేర్కొన్నారు.
పశ్చిమ టెక్సాస్‌లో గత నెల 16న భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై దాని తీవ్రత 5.3గా నమోదైంది.
భూకంపాల ప్రపంచం..!
Indonesia earthquake news : ప్రపంచవ్యాప్తంగా భూకంపాల ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇండోనేషియాలో భూకంపాల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. గత నెల 21న సంభవించిన భూకంపంలో 160కిపైగా మంది ప్రాణాలు కోల్పోయారు.
పర్వత ప్రాంతమైన పశ్చిమ జావాలోని సింజూర్ పట్టణంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.6గా నమోదైంది. ఈ ప్రాంతంలో 2.5మిలియన్ మంది జీవిస్తున్నారు. భూకంపం ధాటికి అనేక భవనాలు నేలకూలాయి.
ఇండోనేషియా విపత్త నిర్వహణ సంస్థ ప్రకారం.. భూప్రకంపనల ధాటికి 2,200కుపైగా ఇళ్లు కూలిపోయాయి. 5,300మంది ప్రజలు గల్లంతయ్యారు.