తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jaipur Earthquake Today : వరుస భూకంపాలతో ఉలిక్కిపడ్డ జైపూర్​.. 30 నిమిషాల్లో మూడుసార్లు!

Jaipur earthquake today : వరుస భూకంపాలతో ఉలిక్కిపడ్డ జైపూర్​.. 30 నిమిషాల్లో మూడుసార్లు!

Sharath Chitturi HT Telugu

21 July 2023, 7:53 IST

google News
  • Jaipur earthquake today : వరుస భూకంపాలతో జైపూర్​ ప్రజలు ఉలిక్కిపడ్డారు. 30 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించింది!

జైపూర్​లో భుకంపం.. మణిపూర్​లో కూాడా!
జైపూర్​లో భుకంపం.. మణిపూర్​లో కూాడా!

జైపూర్​లో భుకంపం.. మణిపూర్​లో కూాడా!

Jaipur earthquake today : వరుస భూకంపాలతో రాజస్థాన్​ జైపూర్​ ప్రజలు ఉలిక్కిపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఆ ప్రాంతంలో అరగంట వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది. అనేక ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

శుక్రవారం తెల్లవారుజాము 4:09 గంటలకు భూమికి 10కి.మీల దిగువన మొదటి భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేల్​పై దీని తీవ్రత 4.4గా నమోదైంది. ఆ తర్వాత 4:22 గంటలకు భూమికి 5 కి.మీల దిగువన 3.4 తీవ్రతతో భూప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. ఇక చివరిగా.. తెల్లవారుజామున 4:25 గంటలకు 3.4 తీవ్రతతో భూమికి 10 కి.మీల దిగువన భూమి కంపించింది. అప్పటికే ప్రజలు భయంతో పరుగులు తీశారు.

జైపూర్​ భూకంపం తీవ్రత తక్కువగా ఉండటంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరిగిందనే విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదు. కాగా భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలను ప్రజలు సోషల్​ మీడియాలో షేర్​ చేశారు.

"జైపూర్​లోని చాలా ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. అందరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను," అని రాజస్థాన్​ మాజీ సీఎం వసుంధర రాజే ట్వీట్​ చేశారు.

మణిపూర్​లో కూడా..!

ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్​లో కూడా శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉక్రుల్​ అనే ప్రాంతంలో 5:01 గంటలకు 3.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విషయాన్ని నేషనల్​ సెంటర్​ ఫర్​ సీస్మోలాజీ వెల్లడించింది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని సమాచారం.

తదుపరి వ్యాసం