తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kashmiri Pandit Families Leaving Valley: లోయ విడిచి వెళ్తున్న కశ్మీరీ పండిట్లు

Kashmiri Pandit families leaving Valley: లోయ విడిచి వెళ్తున్న కశ్మీరీ పండిట్లు

HT Telugu Desk HT Telugu

27 October 2022, 17:19 IST

google News
  • Kashmiri Pandit families leaving Valley: ప్రాణ భయంతో కశ్మీరీ పండిట్లు మరోసారి కశ్మీర్ లోయలోని స్వస్థలాలను విడిచి వెళ్తున్నారు. 

కశ్మీరీ పండిట్లపై దాడులకు నిరసనగా కొవ్వొత్తి ప్రదర్శన (ఫైల్ ఫొటో)
కశ్మీరీ పండిట్లపై దాడులకు నిరసనగా కొవ్వొత్తి ప్రదర్శన (ఫైల్ ఫొటో)

కశ్మీరీ పండిట్లపై దాడులకు నిరసనగా కొవ్వొత్తి ప్రదర్శన (ఫైల్ ఫొటో)

Kashmiri Pandit families leaving Valley: కశ్మీరీ పండిట్ కుటుంబాలు కశ్మీర్ లోయను విడిచి వెళ్తున్నాయి. ఉగ్రవాదుల నుంచి ప్రాణాలకు ముప్పు ఉందని, ప్రభుత్వం వైపు నుంచి భద్రతాపరమైన సహకారం లేదని ఆరోపిస్తూ వారు సొంత ఊర్లను విడిచి వెళ్లిపోతున్నారు.

Kashmiri Pandit families leaving Valley: ఈ సంవత్సరం 17 మంది..

ఈ సంవత్సరంలో ఉగ్రవాదులు పౌరులు, మైనారిటీలు, వలస కూలీలు, భద్రత బలగాలు లక్ష్యంగా కశ్మీర్లో జరిపిన దాడుల్లో 17 మంది చనిపోయారు. వారిలో ముగ్గురు కశ్మీరీ పండిట్లు. ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్లి మరీ, అక్కడ విధుల్లో ఉన్న ఒక కశ్మీరీ పండిట్ ఉద్యోగిని కాల్చి చంపారు. ప్రాణ భయంతో ఇంట్లో నుంచి బయటకు రావడానికే జంకుతున్నామని కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి (Kashmiri Pandit Sangarsh Samiti -KPSS) ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Kashmiri Pandit families leaving Valley: 17 కుటుంబాలు..

మే నెల నుంచి ఇప్పటివరకు 17 కశ్మీరీ పండిట్ కుటుంబాలు కశ్మీర్ లోయను విడిచి వెళ్లాయని Kashmiri Pandit Sangarsh Samiti (KPSS) వెల్లడించింది. సోమవారం ఒక్క రోజే 9 కుటుంబాలు దక్షిణ కశ్మీర్ లోని తమ ఇళ్లు, బంధుమిత్రులు, ఆస్తిపాస్తులను వదిలి వెళ్లిపోయాయని తెలిపింది. ఇతర కశ్మీరీ పండిట్లు కశ్మీర్ ను విడిచివెళ్లకుండా చూస్తామని KPSS అధ్యక్షుడు సజయ్ టికూ తెలిపారు.

Kashmiri Pandit families leaving Valley: ఇంటి దగ్గరలో..

ప్రాణ భయంతో ఇంట్లో నుంచి బయటకు రావడానికే భయపడి, అత్యవసరమైతే తప్ప అడుగు బయటపెట్టని 56 ఏళ్ల కశ్మీరీ పండిట్ పూరన్ కృష్ణన్ ను అక్టోబర్ 15న అతడి ఇంటి సమీపంలోనే కాల్చి చంపారు. ఆగస్ట్ 16న షోపియాన్ జిల్లాలో తమ యాపిల్ తోటలో పని చేసుకుంటున్న సునీల్ కుమార్ భట్ ను చంపేశారు. మే 12న రాహుల్ భట్ ను తను పని చేస్తున్న ప్రపభుత్వ కార్యాలయంలోనే కాల్చి చంపేశారు. కశ్మీరీ పండిట్ల హత్యకు తమదే బాధ్యత అని ‘కశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్’ సంస్థ ప్రకటించింది.

తదుపరి వ్యాసం