Kashmiri Pandit shot dead: మరో కశ్మీరీ పండిట్ దారుణ హత్య-kashmiri pandit shot dead by militants in jk s shopian ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kashmiri Pandit Shot Dead: మరో కశ్మీరీ పండిట్ దారుణ హత్య

Kashmiri Pandit shot dead: మరో కశ్మీరీ పండిట్ దారుణ హత్య

HT Telugu Desk HT Telugu
Oct 15, 2022 02:46 PM IST

Kashmiri Pandit shot dead: జమ్మూకశ్మీర్ లో కశ్మీరీ పండిట్ల దారుణ హత్యలు కొనసాగుతున్నాయి. శనివారం ఉగ్రవాదులు కశ్మీర్ లోని షోపియాన్ లో ఒక కశ్మీరీ పండిట్ ను కాల్చి చంపారు.

<p>ఘటనాస్థలంలో భద్రత దళాలు</p>
ఘటనాస్థలంలో భద్రత దళాలు (HT_PRINT)

Kashmiri Pandit shot dead: దక్షిణ కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలోని చౌధరిగుండ్ ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. శనివారం ఉదయం కశ్మీరీ పండిట్ పూరన్ కృష్ణన్ భట్ ను ఆయన ఇంటి సమీపంలోనే ఉగ్రవాదులు కాల్చి చంపారు.

Kashmiri Pandit shot dead: అత్యంత సమీపం నుంచి..

అత్యంత సమీపం నుంచి కాల్చడంతో కశ్మీరీ పండిట్ పూరన్ కృష్ణన్ భట్ అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఆర్మీ, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు ప్రారంభించారు.

Kashmiri Pandit shot dead: ఇద్దరు పిల్లలు..

ఉగ్రవాదుల కాల్పుల్ల ప్రాణాలు కోల్పోయిన పూరన్ కృష్ణన్ భట్ కు భార్య, 5, 7 తరగతులు చదువుతున్న ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. భట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడే కాదని బంధువులు చెబుతున్నారు.

Kashmiri Pandit shot dead: స్థానికేతరులు, పండిట్లే లక్ష్యం

ఇటీవలి కాలంలో ఉగ్రవాదుల వ్యూహంలో మార్పు వచ్చింది. వారు ప్రస్తుతం ప్రధానంగా కశ్మీరీ పండిట్లు, స్థానికేతర కార్మికులు, భద్రత బలగాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వారు ముగ్గురు కశ్మీరీ పండిట్లను కాల్చి చంపేశారు. రాహుల్ భట్ అనే పండిట్ ను అతడు పని చేస్తున్న ప్రభుత్వ కార్యాలయంలోనే కాల్పులు జరిపి చంపేశారు. ఆగస్ట్ నెలలో షోపియాన్ జిల్లాలోని ఒక యాపిల్ తోటలో ఇద్దరు కశ్మీరీ పండిట్ సోదరులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఇద్దరు సోదరుల్లో సునీల్ కుమార్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, పింటూ కుమార్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ఎన్నికలు దగ్గర పడుతున్న పరిస్థితుల్లో ఉగ్రవాదుల తమ దాడులను మరింత తీవ్రం చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

Whats_app_banner