తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nickel Plant Explosion : ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 13మంది దుర్మరణం!

Nickel plant explosion : ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 13మంది దుర్మరణం!

Sharath Chitturi HT Telugu

24 December 2023, 14:12 IST

google News
    • Indonesia Nickel plant explosion : ఇండోనేషియాలోని ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించడంతో 13మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 38మంది గాయపడ్డారు.
ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 13మంది దుర్మరణం
ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 13మంది దుర్మరణం

ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 13మంది దుర్మరణం

Indonesia Nickel plant explosion : ఇండోనేషియాలో విషాదకర సంఘటం చోటుచేసుకుంది. సులావేసి ద్వీపంలో.. చైనాకు చెందిన ఓ నికెల్​ ప్లాంట్​లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13మంది మరణించారు. మరో 38మంది గాయపడ్డారు.

ఇదీ జరిగింది..

సెంట్రల్​ సులావెసి రాష్ట్రంలోని మొరోవాలి ఇండస్ట్రియల్​ పార్క్​లో ఉన్న పీటీ ఐటీఎస్​ఎస్​ (ఇండోనేషియా సింగ్​షాన్​ స్టెయిన్​లెస్​ స్టీల్​) ప్లాంట్​లో.. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకు పేలుడు సంభవించింది. మృతుల సంఖ్యను తొలుత 12మందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత.. దానిని 13కు పెంచింది. మరణించిన వారిలో 8మంది ఇండోనేషియావాసులతో పాటు ఐదుగురు చైనా కార్మికులు ఉన్నట్టు వెల్లడించింది. 

Indonesia explosion today : కాగా.. ఘటనకు గల కారణాలపై ఇంకా స్పష్టత లేదు. కానీ.. ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన అధికారులకు పలు కీలక విషయాలు తెలిశాయి. ప్లాంట్​లోని ఓ ఫర్నేస్​కు మరమ్మత్తులు చేస్తుండగా.. ఓ ఫ్లేమబుల్​ లిక్విడ్​కి హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. అది, ఆ పక్కనే ఉన్న ఆక్సీజన్​ ట్యాంక్​కు వ్యాపించింది. చివరికి.. ఆ ఆక్సీజెన్​ ట్యాంక్​ పేలిపోయింది.

మరోవైపు.. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. ఫ్యాక్టరీలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిని స్థానికి ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించింది. చివరికి.. ఆదివారం ఉదయం నాటికి మంటలను అదుపు చేసింది.

Nickel plant explosion in Indonesia : ఐటీఎస్​ఎస్​లో చైనాకు చెందిన అతిపెద్ద స్టెయిన్​లెస్​ స్టీల్​ తయారీ సంస్థ సింగ్​షాన్ హోల్డింగ్​ గ్రూప్​న​కు మెజారిటీ వాటా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద నికెల్​ ఉత్పత్తి చేసే సంస్థ కూడా ఈ సింగ్​షాన్​ గ్రూపే!

తాజా ఘటనపై సంస్థ స్పందించింది. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబాలకు సానుభూతిని ప్రకటించింది.

మరోవైపు.. ఇండోనేషియా ప్లాంట్​లో పేలుడుకు సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఘటనలో చాలా మంది ముఖాలు కాలిపోయినట్టు.. ఫొటోలను చూస్తుంటే తెలుస్తోంది. వారి ఒంటి మీద దుస్తులు కూడా కాలిపోయాయి!

కార్మికుల భద్రత అంటే లెక్కలేదు..!

Indonesia  explosion death toll : పేలుడు ఘటనలతో ఇండోనేషియాలోని ఈ ఇండస్ట్రియల్​ పార్క్​ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది తొలినాళ్లల్లో.. పార్క్​లోని ఓ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి.. అక్కడి భద్రతా ప్రమాణాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

అయితే.. ఇండోనేషియాలో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు! 250 మిలియన్​ మంది జనాభా కలిగిన ఆ దేశంలో.. భద్రతకు సంబంధించిన నియమాలను చాలా కంపెనీలు లెక్క చేయడం లేదు! మరీ ముఖ్యంగా.. చైనా ఆధారిత సంస్థల్లో చాలా వరకు సెక్యూరిటీ రూల్స్​ని పక్కనపడేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ప్రమాదానికి గురైన ప్లాంట్​లోనే.. జూన్​లో ఓ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒకరు మరణించినట్టు, ఆరుగురు గాయపడినట్టు సమాచారం.

తదుపరి వ్యాసం