Nagpur factory blast : ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 9మంది దుర్మరణం!
Nagpur factory blast : మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 9మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నట్టు సమాచారం.
Nagpur factory blast today : మహారాష్ట్రలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని ఓ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 9మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
నాగ్‌పూర్‌లోని బజార్గావ్ గ్రామానికి సమీపంలో ఉన్న సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో ఈ దుర్ఘటన జరిగింది. కంపెనీలోని కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో పేలుడు సంభవించింది. ఆ సమయంలో అక్కడ 12మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా.. నాగ్‌పూర్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. 9మంది మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Solar explosive company : కాగా.. ఫ్యాక్టరీలో పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ.. కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ కార్యకలాపాలు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని సమాచారం.
ఈ సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ.. భద్రతా దళాలకు ఆయుధాలు, డ్రోన్లు సప్లై చేస్తుంది. మరోవైపు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
రూ. 5లక్షల పరిహారం..
Nagpur solar explosive company : నాగ్‌పూర్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. మరణించిన తొమ్మిది మందిలో ఆరుగురు మహిళలు ఉన్నట్టు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందివ్వాలని అధికారులను సూచించినట్టు వెల్లడించారు.
సంబంధిత కథనం