తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Relationships: నేను సిద్ధమే.. వద్దు ఒకరు చాలులే..!

Relationships: నేను సిద్ధమే.. వద్దు ఒకరు చాలులే..!

HT Telugu Desk HT Telugu

17 March 2022, 23:42 IST

google News
    • రెండో బిడ్డను కనడానికి భార్యలు సిద్దంగా ఉన్న.. భర్తలు మాత్రం ఆ విషయంలో విముఖత చూపిస్తున్నారు. పెరిగిపోతున్న ఖర్చు లు. వారితో వెచ్చించే సమయం, ఓపిక లేకపోవడంతో ఒకే బిడ్డతోనే చాలు అనుకుంటున్నారు.
Husband not interested in pregnancy
Husband not interested in pregnancy

Husband not interested in pregnancy

ఈ రోజుల్లో పిల్లలను పెంచడం అంత తేలికైన విషయం కాదు. తల్లిదండ్రులైన తర్వాత, బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. పిల్లలను కంటి రెప్పల కాపాడుకుంటూ.. వారు పెద్దయేంత వరకు ఆలనాపాలన శ్రద్దగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శిశువు బాహ్య ప్రపంచానికి పరిచయమయే వరకు పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మానసిక స్థితిని మెరుగుపర్చి.. వారు భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దాలి. మరీ ఇన్ని బాధ్యతల మధ్య తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులైతే ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. దీంతో చాలా మంది కపుల్స్ రెండో బిడ్డను కనేందుకు సందిగ్ధంలో పడుతున్నారు.

మొదటి బిడ్డ కలిగినప్పుడు  తల్లిదండ్రులు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేము. ఏ జంట అయినా మొదటి సారి తల్లిదండ్రులు అయినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ రెండో బిడ్డ విషయంలో మాత్రం చాలా మంది తల్లిదండ్రులు సందేహిస్తుంటారు. బిజీ లైఫ్‌లో రెండవ బిడ్డకు మునుపటిలా ప్రేమను ఇవ్వగలమా.. అని సందేహిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రెండో బిడ్డను కనడానికి భార్యలు సిద్దంగా ఉన్న.. భర్తలు మాత్రం ఆ విషయంలో విముఖత చూపిస్తున్నారు. పెరిగిపోతున్న ఖర్చు లు. వారితో వెచ్చించే సమయం, ఓపిక లేకపోవడంతో ఒకే బిడ్డతోనే చాలు అనుకుంటున్నారు.

కొంత మంది కపుల్స్ ఉద్యోగంలో ఒత్తిడి, ఇంట్లో పని కారణంగా ఒకే సంతానంతో సరిపెట్టుకోవాలని భావిస్తున్నారు. పరిస్థితులు అనుకూలించనప్పుడు రెండో సంతానంపై దృష్టి పెట్టడం కష్టమనే ఉద్దేశంతో ఉన్నారు

 

తదుపరి వ్యాసం