Healthy Skin | మెరిసే చర్మం కావాలంటే.. ఈ స్కిన్ టానిక్ తాగాల్సిందే..
16 March 2022, 7:24 IST
- మంచి హెల్తీ గ్లోయింగ్ స్కిన్ కావాలని ఎవరికి ఉండదు. అందంగా కనిపించేందుకు అవసరమైన ఉత్పత్తులను కొని.. వాటిని వాడుతూ చర్మాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాము. బయటకు ఎన్ని పూసినా.. గ్లోయింగ్ అనేది లోపల నుంచి రావాలి కాబట్టి.. దానికి తగినట్లు మనం ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో ఈ స్కిన్ టానిక్‌ను భాగం చేసుకోవాలి.
బ్యూటీ టానిక్
Skin Tonic | ఈ స్కిన్ టానిక్ అంటే ఏమిటి? అసలు దీనిని ఎందుకు తీసుకోవాలి. ఇది ఎక్కడ దొరుకుతుంది. ఎలా తయారు చేసుకోవాలి అని అనుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం మీకు ఇప్పుడే దొరుకుతుంది. ఈ స్కిన్ టానిక్ ఆరోగ్యవంతమైన మెరిసే చర్మం కావాలనుకునేవారు తీసుకోవచ్చు. రిజల్ట్ కూడా సూపర్ క్విక్‌గా ఉంటుంది. దీనిని ఉదయం అల్పాహరంలో భాగం చేసుకోవచ్చు. లేదా మిడ్ డే మీల్ స్నాక్‌లా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ స్కిన్ టానిక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* బీట్రూట్ - 1/4
* టమాటో- 1
* బాదం- 3 (నానబెట్టినవి)
* జీరా పౌడర్- తగినంత
* ఉప్పు-తగినంత
* నిమ్మకాయ-1 (స్పూన్ రసం)
తయారీ విధానం
బీట్ రూట్లో పావు వంతు తీసుకుని ముక్కలుగా కోసి మిక్సిలో వేసి గ్రైండ్ చేయాలి. తరువాత టమాట ముక్కలను వేసి గ్రైండ్ చేసి.. ఆ పేస్ట్‌ను ఒక గిన్నేలోకి తీయాలి. దానిలో జీరా పౌడర్, ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. పైన బాదం పలుకలను వేసి గార్నిష్ చేసుకోవాలి. చూశారుగా తయారు చేసుకోవడం ఎంత సులువో. దీనిని బ్రేక్‌ఫాస్ట్‌గా, మిడ్ డే మీల్ స్నాక్‌గా తీసుకుంటే.. చర్మం మెరిసిపోవడం ఖాయం.