Foods for Mood: ఉదయాన్నే దిగాలుగా అనిపిస్తోందా? ఈ ఫుడ్స్ మీ మూడ్‍ను ఇట్టే మార్చేస్తాయి!
25 November 2024, 10:30 IST
- Foods for Mood: ఒక్కోసారి మనసు దిగాలుగా అనిపిస్తుంది. ఏమీ తోచదు. ఇలాంటి సందర్భాల్లో మూడ్‍ను బాగా చేసేందుకు కొన్ని ఫుడ్స్ సహకరిస్తాయి. జోష్ పెరగడంలో సహకరిస్తాయి.
Foods for Mood: ఉదయాన్నే దిగాలుగా అనిపిస్తోందా? ఈ ఫుడ్స్ మీ మూడ్‍ను ఇట్టే మార్చేస్తాయి!
కొన్నిసార్లు మనసు బాగోదు. ఏదో దిగాలుగా అనిపిస్తుంది. విభిన్న కారణాల వల్ల మూడ్ సరిగా ఉండదు. అయితే, కొన్నిసార్లు చిన్నచిన్న విషయాల వల్ల కూడా కొందరు ఎక్కువగా దిగులు పడుతుంటారు. బాధలో ఉన్నట్టు డీలాగా ఉంటారు. ముఖ్యంగా ఎక్కువగా ఉదయం సమయాల్లో ఇలా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని ఆహారాలు తినడం వల్ల మూడ్ మెరుగుపడుతుంది. చురుగ్గా అయ్యేందుకు ఇవి సహకరిస్తాయి. ఈ ఆహారాల్లోని పోషకాలు ఇందుకు తోడ్పడతాయి. అలా మూడ్‍ను మార్చేయగల ఆరు ఆహారాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్‍లో ఫ్లేవనాయిడ్స్, పోలిఫెనోల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది తింటే శరీరంలో సెరటోనిన్ పెరుగుతుంది. ఒత్తిడిని, ఆందోళన తగ్గేలా ఈ సెలటోనిన్ చేయగలదు. డార్క్ చాక్లెట్ తినేందుకు కూడా చాలా మంది ఇష్టపడతారు. దిగాలుగా ఉన్న ఇది తింటే మూడ్ మారి హ్యాపీగా అనిపిస్తుంది. డార్క్ చాక్లెట్ నేరుగా అయినా తినొచ్చు. ఓట్స్, డ్రింక్స్, కాఫీలోనూ కలిపి తీసుకోవచ్చు.
నట్స్, విత్తనాలు
బాదం, వాల్‍నట్స్, జీడిపప్పు లాంటి నట్స్, గుమ్మడి, పొద్దుతిరుగుడు విత్తనాలు తిన్నా మూడ్ హ్యాపీగా మారే అవకాశం ఉంటుంది. వీటిలో అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి సెరటోటిన్‍ను పెంచుతుంది. దీంతో మూడ్ మారేందుకు నట్స్, విత్తనాలు తినొచ్చు. వీటిలోని కీలకమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
అరటి పండ్లు
అరటి పండ్లలో విటమిన్ బీ6 ఎక్కువగా ఉంటుంది. ఫీల్‍గుడ్ హార్మోన్ డొపమైన్‍తో పాటు సెరటోనిన్ ఉత్పత్తిని అరటి పెంచగలదు. దీంతో సంతోషంగా అనిపించి మూడ్ మారుతుంది. అరటిలో ఫైబర్ కూడా మెండుగా ఉంటుంది. కడుపుకు కూడా హాయిగా అనిపిస్తుంది.
ఓట్స్
ఓట్స్‌లో డయెటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉదయాన్నే ఓట్స్‌తో చేసిన ఫుడ్స్ తింటే శరీరంలో ఎనర్జీ బాగా పెరుగుతుంది. నీరసం, బద్దకం లాంటివి తగ్గుతాయి. శరీరం చురుగ్గా అయ్యేందుకు ఓట్స్ తోడ్పడతాయి. ఇవి తినడం వల్ల మూడ్ బాగా మారిపోతుంది. హ్యాపీ ఫీలింగ్‍ను ఇవ్వగలదు.
ఫ్యాటీ ఫిష్
సాల్మోన్, టునా లాంటి ఫ్యాటీ చేపుల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. ఇవి ఆందోళన స్థాయిని తగ్గించగలవు. శరీరం ప్రశాంతంగా ఫీల్ అయ్యేలా చేయగలవు. ఇవి తిన్నా మూడ్ మారుతుంది.
బెర్రీలు
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ లాంటి బెర్రీల్లో ఫ్లేవనాయిడ్స్, యాంథోసియానిస్ లాంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఒత్తిడి బెర్రీలు తగ్గిస్తాయి. ఆందోళన తగ్గేలా చేయగలవు. మూడ్‍ను హ్యాపీగా చేయడంలో బెర్రీలు ఉపకరిస్తాయి.
టాపిక్