డార్క్ చాక్లెట్ తింటే కలిగే లాభాలు ఇవే.. రోజులో ఎన్ని గ్రాములు తినొచ్చంటే.. 

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Aug 12, 2024

Hindustan Times
Telugu

డార్క్ చాక్లెట్‍లో కొన్ని రకాల ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పరిమితిమేర దీన్ని రోజూ తినొచ్చు. డార్క్ చాక్లెట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ చూడండి. 

Photo: Pexels

డార్క్ చాక్లెట్‍లో ఉండే ఫోలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ యాంటీఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. అందుకే ఇది తింటే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. 

Photo: Pexels

డార్క్ చాక్లెట్లు తినడం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల వల్ల కలిగే డ్యామేజ్‍ను ఇది కాస్త తగ్గించలదు. 

Photo: Pexels

డార్క్ చాక్లెట్ మెదడు ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది. మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి పెరిగేందుకు కూడా తోడ్పడుతుంది. 

Photo: Pexels

డార్క్ చాక్లెట్‍లో యాంటీ-ఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది తింటే శరీరంలో మంట తగ్గేందుకు కూడా సహాయపడుతుంది.

Photo: Pexels

డార్క్ చాక్లెట్‍ను రెగ్యులర్‌గా పరిమితిమేర తింటే గుండె వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. గుండెకు మేలు జరుగుతుంది.

Photo: Pexels

రోజులో డార్క్ చాక్లెట్‍ను 30 గ్రాముల నుంచి 50 గ్రాములోపే తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతకు మించి తినకూడదు. అతిగా తింటే కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి.

Photo: Pexels

వినాయకుని రూపం చెప్పే గొప్ప సైకాలజీ లెస్సన్స్

pixabay