తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  వాట్సాప్ గ్రూప్‌ అడ్మిన్‌లకు గుడ్‌న్యూస్.. మీ కోసం వాట్సాప్ కొత్త ఫీచర్

వాట్సాప్ గ్రూప్‌ అడ్మిన్‌లకు గుడ్‌న్యూస్.. మీ కోసం వాట్సాప్ కొత్త ఫీచర్

28 February 2022, 16:33 IST

google News
    • కొన్ని సందర్భాల్లో గ్రూప్‌ సభ్యులు చేసే పోస్టులు మిగతా వారికి ఇబ్బంది కలిగిస్తుంటాయి. కొన్నిసార్లు గ్రూప్‌ అడ్మిన్‌లకు కూడా ఇవి లేనిపోని సమస్యలను సృష్టించి పెడతాయి.  అయితే భవిష్యత్‌లో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది.
ఇన్స్‌స్టాంట్‌ మెసేజింగ్ యాప్ వాట్సాప్
ఇన్స్‌స్టాంట్‌ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (REUTERS)

ఇన్స్‌స్టాంట్‌ మెసేజింగ్ యాప్ వాట్సాప్

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మారుతున్న కాలానికి అనుగుణంగా తన యాప్‌లో కొత్తకొత్త అప్‌డేట్స్ తీసుకువస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వాట్సాప్‌(Whatsapp)లో అందరినీ ఒక చోట చేర్చి, అందరితో మిమ్మల్ని కలిపే ఫీచర్ వాట్సాప్‌ గ్రూప్స్. వాట్సాప్‌లోని ఈ గ్రూప్స్ యూజర్ల నుంచి మంచి ఆదరణ చూరగొన్నాయి.  కుటుంబం, స్నేహితులు, ఒకే అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు నచ్చిన అంశాలు పంచుకునేందుకు వీలుగా వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పడ్డాయి. గ్రూప్‌ సభ్యులు టెక్ట్స్‌, ఫొటో, వీడియో, డాక్యుమెంట్‌ వంటివి గ్రూప్‌లో అందరితో షేర్ చేసుకోవచ్చు.

అయితే కొన్ని సందర్భాల్లో గ్రూప్‌ సభ్యులు చేసే పోస్టులు మిగతా వారికి ఇబ్బంది కలిగిస్తుంటాయి. కొన్నిసార్లు గ్రూప్‌ అడ్మిన్‌లకు కూడా ఇవి లేనిపోని సమస్యలను సృష్టించి పెడతాయి. అలాంటి సందేశాలను తొలగించాలని అనుకున్నప్పటికీ ఆ ఆప్షన్ పోస్టు చేసిన వారికి తప్ప మిగతా వారికి ఉండదు. దీంతో గ్రూప్‌ అడ్మిన్‌లు చిక్కుల్లో పడుతుంటారు. అయితే భవిష్యత్‌లో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది.

వాట్సాప్ గ్రూప్ కార్యకలాపాలపై అడ్మిన్లకు నియంత్రణ అధికారాలు:

ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే గ్రూప్‌లో షేర్‌ చేసే పోస్టులను అడ్మిన్‌లు కూడా డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ అమల్లోకి తీసుకువచ్చేందుకు వాట్సాప్ కసరత్తులు ప్రారంభించింది. త్వరలోనే యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్(Whatsapp) కమ్యూనిటీ బ్లాగ్- వాట్సాప్‌ బీటా ఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. 

ఈ ఫీచర్‌తో గ్రూప్‌కు సంబంధించి మరిన్ని అధికారాలు అడ్మిన్‌లకు దక్కుతాయి. గ్రూప్‌ సభ్యులు షేర్ చేసిన వాటిని నియంత్రించే అధికారం ఇక మీదట గ్రూప్‌ అడ్మిన్‌లకు ఉంటుంది. గ్రూప్‌లో అభ్యంతరకరమైన సందేశాలు ఏమైనా ఉంటే వెంటనే తొలిగించవచ్చు. తర్వాత చాట్ పేజీలో ‘గ్రూప్‌ అడ్మిన్‌ డిలీట్ చేశారు’ అనే నోట్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ గ్రూప్‌లోని అడ్మిన్‌లు అందరికీ అందుబాటులో ఉంటుంది.

వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది  ‘డిలీట్‌ మెసేజ్‌ ఫర్‌ ఎవ్రీవన్‌’ అనే పేరుతో ఈ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ఈ ఆప్షన్ ప్రత్యేకత ఏమిటంటే గ్రూప్‌లోని సభ్యుడు తాము పంపిన మెసేజ్‌ను ఎంత కాలవ్యవధిలో డిలీట్‌ చేయ్యాలనే టైమ్ పరిధిని నిర్ణయించవచ్చు. ఆ టైమింగ్ విషయానికి వస్తే గంట, 8 నిమిషాలు లేదా 16 సెకన్ల వరకు సందేశాన్ని డిలీట్‌ చేసే ఆప్షన్స్ ఉంటాయి. ఇంతకు ముందు వాట్సాప్‌ మెసేజ్‌ డిలీట్‌ చేయడానికి 7 నిమిషాల సమయం ఉండేది.

వీటితో పాటు డిజిటల్ పేమెంట్స్ కు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది వాట్సాప్. గ్రామీణ ప్రాంతాలోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించేందుకు ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. "డిజిటల్ పేమెంట్స్ ఉత్సవ్" పేరుతో ఈ అవగాహాన కార్యక్రమాన్ని నిర్వహించనుంది.  ఇక్కడ వినియోగదారులకు WhatsApp Pay ద్వారా డిజిటల్ చెల్లింపులు ఎలా చేయాలో అవగాహన కల్పించనుంది. 

టాపిక్

తదుపరి వ్యాసం