WhatsApp Web: ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్ వాడొచ్చు.. ఎలాగో చూడండి!
24 January 2022, 15:17 IST
- ఇప్పటి వరకూ డెస్క్‌టాప్‌లో వాట్సాప్ వాడుతున్నంతసేపూ ఆ ఫోన్ లో నెట్ ఆన్ చేసి ఉండాలి. అప్పుడే మన సందేశాలు అవతలి వ్యక్తికి చేరుతాయి. కానీ ఇకపై వాట్సాప్ సరికొత్త ఫీచర్ వల్ల వాట్సాప్ వెబ్‌కు ఇంటర్నెట్ అవసరం ఉండదు.
వాట్సాప్ ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా..
ప్రముఖ ఇన్‌స్టాంట్ మెసేసెజింగ్ యాప్ వాట్సాప్ (whatsapp) సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లలో వాట్సాప్ వెబ్ వాడాలంటే QR Codeతో కనెక్ట్ చేసే ఫోన్‌లో ఇంటర్నెట్ కచ్చితంగా ఆన్‌లో ఉండాలి. అయితే ఈ కొత్త ఫీచర్ వల్ల ఒక్కసారి మీ ఫోన్‌తో వాట్సాప్ వెబ్ కనెక్ట్ చేస్తే చాలు ఆ తర్వాత ఫోన్ లో నెట్ ఆఫ్ చేసినా చక్కగా కంప్యూటర్లో వాట్సాప్ వాడుకోవచ్చని సంస్థ చెబుతోంది.
14 రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా లాగౌట్
దాదాపు 14 రోజుల పాటు ఫోన్ తో సంబంధం లేకుండా నిరాటంకంగా వాట్సాప్ వెబ్ వాడేయొచ్చు. సందేశాలు పంపడం మాత్రమే కాకుండా ఆడియో, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫీచర్ విండోస్ 10, విండోస్ 11, మాక్ ఓఎస్‌లలో మెరుగ్గా పనిచేస్తుందని వాట్సాప్ తెలిపింది. 14 రోజుల తర్వాత వాట్సాప్ వెబ్ డెస్క్ టాప్‌లో ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోతుంది. తరువాత క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వాట్సాప్ వెబ్ యధావిధిగా వాడుకోవాల్సి ఉంటుంది.
ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి?
ముందుగా మీ ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేసి లింక్డ్ డివైజెస్ (Linked devices)పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మల్టీ-డివైస్ బీటా (multi-device beta program)పై నొక్కండి. తర్వాత వాట్సాప్ ఫీచర్ కు సంబంధించిన వివరాల పేజీ (page) ఓపెన్ అవుతుంది. ఇప్పుడు జాయిన్ బీటా (Join Beta)పై క్లిక్ చేయండి. ఆ తర్వాత “కంటిన్యూ” (Continue) బటన్‌పై నొక్కిన తర్వాత QR Code స్కాన్ చేసి మీ స్మార్ట్‌ఫోన్‌ను వాట్సాప్ వెబ్‌కి లింక్ చేయండి. అయితే పాత వెర్షన్ యాప్ ను ఉపయోగిస్తున్న వారికి ఈ ఫీచర్ పనిచేయదు. అలాగే ప్రైమరీ ఐఫోన్ డివైజ్‌లలో కూడా ఈ ఫీచర్ పనిచేయదు.