తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dreams And Meanings : యాక్సిడెంట్ అయినట్టుగా కల వస్తే ఏం జరుగుతుంది?

Dreams and Meanings : యాక్సిడెంట్ అయినట్టుగా కల వస్తే ఏం జరుగుతుంది?

Anand Sai HT Telugu

25 November 2023, 17:45 IST

google News
    • Meaning Of Dream : యాక్సిడెంట్ అయినట్టు కలలు రావడానికి కూడా ఒక అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. ప్రతి ప్రమాద కలకి దాని ఒక్కో అర్థం ఉంటుంది. అది మనకు జరిగినా, మరొకరికి ప్రమాదం జరిగినా, మరొకరు ప్రమాదం చేసినా వేర్వేరుగా ఉంటాయి. స్వప్న శాస్త్రంలో ఈ కలలకు అర్థమేంటో తెలుసుకుందాం.
స్వప్న శాస్త్రం
స్వప్న శాస్త్రం

స్వప్న శాస్త్రం

కలలు కనడం సహజమైన ప్రక్రియ. మనం అందరం రాత్రి పడుకున్నప్పుడు కలలు కంటాం. కొన్నిసార్లు కలలో కనిపించే భయంకరమైన సంఘటనలు మనల్ని వెంటాడతాయి. ఈ కల ఎందుకు వచ్చింది, దాని అర్థం ఏమిటి, ఇది చెడ్డదా లేదా మంచిదా అని ఆలోచించడం సహజం. అయితే మనం చూసే ప్రతి కలకి ఒక అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది.

మనకు ప్రమాదం జరిగినట్లు కలలు కనవచ్చు లేదా మరెవరికైనా కలలో ప్రమాదం జరగడాన్ని మనం చూడవచ్చు. అలాంటి కల రావడానికి కారణం ఏంటో, దాని అర్థం ఏంటో స్వప్న శాస్త్రంలో తెలుసుకుందాం.

ప్రమాదం గురించి కలలు కనడం అశుభకరమైనదిగా పరిగణిస్తారు. మీరు ఇలా కలలుగన్నట్లయితే, సమీప భవిష్యత్తులో మీరు మీ జీవితంలో పెద్ద నష్టాన్ని చవిచూడవలసి ఉంటుంది. ప్రమాదవశాత్తూ నష్టం జరుగుతుందని, ఇది మీకు పెద్ద షాక్ ఇస్తుందని కలల వివరణ చెబుతోంది.

మీరు ప్రమాదం గురించి కలలుగన్నట్లయితే, ఈ కల చాలా దురదృష్టంగా పరిగణించబడుతుంది. రాబోయే రోజుల్లో కష్టాల మీద కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం. ఈ కలలు మీరు మానసిక ఒత్తిడి లేదా సమస్యలను ఎదుర్కొంటారని సూచిస్తున్నాయి. అలాంటి కల వస్తే కలలోనే కాదు నిజ జీవితంలో కూడా ప్రశాంతత ఉండదు.

మరొకరికి ప్రమాదం జరిగినట్టుగా కలలు కనడం కూడా ప్రమాదాన్ని అంచనా వేయెుచ్చు. మీరు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ కల మీకు చెబుతుంది. ఇది మీ శత్రువులను పెంచుకోవచ్చు. అంతేకాక, శత్రువులు మీకు హాని చేయగలరని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఇది శుభప్రదంగా పరిగణించకూడదు.

కలలో మరొకరు యాక్సిడెంట్ చేయడం అంటే మీకు ఒకరిపై ద్వేషం ఉందని, ఆ ద్వేషం నేటికీ మీ మనసులో ఉంటుంది. మీరు వేరొకరి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని, ద్వేషాన్ని మరింత కొనసాగిస్తారని ఇది సూచిస్తుంది. అయితే ఇలా కలలుగన్నట్లయితే అశుభం అని స్వప్న శాస్త్రం చెబుతోంది.

ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడులు సర్వసాధారణం. మనకు మంచి కలలు వచ్చినప్పుడు, మనం రిలాక్స్‌గా, సంతోషంగా ఉంటాం. కానీ చెడు విషయాలు అక్షరాలా మనల్ని ఏడ్చేస్తాయి. నిజ జీవితంలో ఏడ్చినట్లే, కలలో కూడా ఒక్కసారి ఏడుస్తాం. చాలా మందికి కలలో ఏడ్చే అలవాటు ఉంటుంది. నిద్రలేచిన తర్వాత కలలో ఇలా ఏడవడం శుభమో, అశుభమో అని ఆలోచిస్తాం.

గమనిక : పైన ఇచ్చిన కథనం విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.. ఇందులోని అంశాలను ఆమోదించదు. మీ విచక్షణ ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. సమాచారం అందించేందుకు మాత్రమే కథనం ఇచ్చాం.

తదుపరి వ్యాసం