Eat Light | నైట్ భోజనానికి లైట్‌గా తినాలనుకుంటే.. ఇవీ మంచివి!
20 April 2022, 22:35 IST
- తేలికైన ఆహారం అంతే తేలికగా జీర్ణమయ్యేది కాదు. మైదా పిండితో చేసినవీ తేలిగ్గానే జీర్ణమవుతాయి, కానీ ఇది బరువును పెంచుతుంది. నిజమైన లైట్ మీల్స్ అంటే ఏంటో న్యూట్రిషనిస్టులు వివరించారు..
Light Meal
రాత్రి భోజనంలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి, తిరిగి రాత్రి ఆకలి వేయకూడదు అంటే అందుకు సరైన ఎంపికలు పోహా (అటుకులు), ప్యాలాలు (మర్మరాలు), ఉప్మా అని సూచిస్తున్నారు. పోషకాహార నిపుణులు. ఇవి తేలికపాటి ఆహారమే కాకుండా సులభంగా జీర్ణం అవుతాయి. అనవసరంగా క్యాలరీలు పెరిగవు, బరువు నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. ఆరోగ్య స్పృహ కలిగిన వ్యక్తులు రాత్రి భోజనంలో ఇవి తీసుకోవచ్చు, వీలైతే ఒక పండును తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
పోషకాహార నిపుణులు భువన్ కడుపు నింపేటువంటి తేలికైన ఆహార పదార్థాల గురించి వివరించారు. పోషకాహారాలపై ఉన్న అపోహాలను ఆయన నివృత్తి చేశారు.
మైదాతో చేసిన రోటీలు, చక్కెరతో చేసిన వంటకాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి. కానీ ఇందులో కార్బోహెడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్లు ఇంకా ఫైబర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని తింటే క్యాలరీలు పెరుగుతాయి, బరువు పెరుగుతారని భువన్ చెప్పారు.
చాలా మంది రాత్రి పూట లైట్‌గా చపాతీ, దాల్ తిన్నాము అని చెప్తారు. కానీ నిజానికి ఒక ప్లేట్ పోహా లేదా ఉప్మా అంతకంటే తేలికైన ఆహారం, ఉత్తమమైన ఆహారం అని గుర్తించరు.
కడుపు నిండనట్లుగా తేలికగా అనిపించే ఆహారాలన్నీ నిజానికి లైట్ ఫుడ్స్ కావు. చక్కెర చాలా త్వరగా జీర్ణమవుతుంది. తిన్నా కూడా తిననట్లు అనిపిస్తుంది. కానీ అది నేరుగా క్యాలరీల రూపంలో ఉంటుది. కడుపులో బరువు అనిపించదు కానీ బరువు పెంచుతుంది అని న్యూట్రిషనిస్టులు వివరిస్తున్నారు.
కాబట్టి తీసుకునే ఆహారం ఎలాంటిది? అందులో ప్రోటీన్, ఫైబర్ ఉన్నాయా లేక బరువును పెంచే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. అధిక కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహరం ప్రతిరోజూ తీసుకుంటే అనారోగ్యాలకు దారితీస్తుందని పేర్కొన్నరు. అనారోగ్యంతో ఉన్నప్పుడు, శక్తి త్వరగా అవసరం అయ్యేటపుడు పీచు ఉన్న ఆహారాలను తీసుకోవాలని సూచిస్తున్నారు.