తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kanda Poha | హెల్తీ.. రుచికరమైన.. కాంద పోహా.. తింటే అనాల్సిందే ఆహా..

Kanda Poha | హెల్తీ.. రుచికరమైన.. కాంద పోహా.. తింటే అనాల్సిందే ఆహా..

19 March 2022, 13:26 IST

    • హోలీ రోజు బాగా ఆడి అలసిపోయి.. తరువాత రోజు బ్రేక్​ఫాస్ట్ టైమ్ అయిపోయాక లేచి.. ఇప్పుడు ఏమి వండుకుని తినాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు కాంద (ఉల్లిపాయలు) పోహా (అటుకులు) ట్రై చేయండి. ఇది మీకు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలో మీకు తెలియదా? అయితే ఇది చదవేయండి.
కాంద పోహ
కాంద పోహ

కాంద పోహ

Healthy Break Fast | అల్పాహారం కోసం, లేదా బ్రంచ్​ కోసం ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకుంటే.. కాంద పోహా మంచి ఎంపిక. ఇది ఎంత రుచిగా ఉంటుందో, ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. దీనిలో తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి ఫిట్​గా ఉండాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. అంతే కాకుండా జీర్ణవ్యవస్థను కూడా సరి చేస్తుంది. పైగా దీనిని తయారు చేయడం చాలా సులభం. మరి కంద పోహను ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

* పోహా- నాలుగు కప్పులు (అటుకులు)

* వేరుశెనగ - కప్పు

* సన్నగా తరిగిన ఉల్లిపాయ- 1 కప్పు

* నూనె- 2 టేబుల్ స్పూన్లు

* ఆవాలు- 1 స్పూన్

* తరిగిన పచ్చిమిర్చి- 2

* జీలకర్ర- 1 స్పూన్

* కరివేపాకు- 8

* ఇంగువ- ఒక చిటికెడు

* పసుపు- 1 స్పూన్

* ఉప్పు- తగినంత

తయారీ విధానం

ముందుగా పోహను సరిపడా నీళ్లలో వేసి కడగాలి. తరువాత దాని నుంచి నీటిని వేరు చేసి.. కొద్దిగా ఉప్పు వేసి పక్కన పెట్టండి. మరోవైపు స్టవ్ మీద పాన్ వేడి చేసి.. దానిలో నూనె వేయాలి. మీడియం మంట మీద వేడి చేసి, అది వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, ఉల్లిపాయ వేసి మీడియం మంట మీద కలుపుతూ ఉండాలి. 3 నుంచి 4 నిమిషాలు మంట మీద ఉండనివ్వాలి. దీనిని కలుపుతూ ఉండాలి.

ఉల్లిపాయ గోధుమ రంగులోకి మారినప్పుడు.. దానిలో పోహా, పసుపు వేయాలి. కావాలంటే, మీరు దానికి కొద్దిగా చక్కెరను కూడా జోడించవచ్చు. ఇప్పుడు మళ్లీ పాన్‌లో ఇవన్నీ కలపండి. తర్వాత నిమ్మరసం, కొత్తిమీర తరుగు, కొబ్బరి తురుము వేయాలి. రెండు మూడు నిముషాల తర్వాత మంట ఆపి పాన్ దించాలి. ఇప్పుడు మీ కంద పోహ సిద్ధంగా ఉంది. వేడిగా లాగించేయడమే తరువాయి.

తదుపరి వ్యాసం