తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleeping Position Problems : బోర్లా పడుకుంటున్నారా? అయితే సమస్యలే

Sleeping Position Problems : బోర్లా పడుకుంటున్నారా? అయితే సమస్యలే

HT Telugu Desk HT Telugu

14 February 2023, 20:15 IST

    • Sleeping Position Tips : ప్రతి మనిషికి పడుకునే విధానంలో తేడా ఉంటుంది. వాళ్ల కంఫర్ట్ ను బట్టి నిద్రపోతారు. అయితే కొంతమంది బోర్లా పడుకుంటారు. దీంతో పొట్ట మీద ఎఫెక్ట్ పడుతుంది. బోర్లా పడుకుంటే.. కొన్ని లాభాలతోపాటుగా నష్టాలు కూడా ఉన్నాయి.
బోర్లా పడుకుంటే సమస్యలు
బోర్లా పడుకుంటే సమస్యలు (unsplash)

బోర్లా పడుకుంటే సమస్యలు

Sleep On Your Stomach Problees : ప్రతి ఒక్కరికీ నిద్రలో వారి స్వంత శైలి ఉంటుంది. కొందరు నిటారుగా చక్కగా నిద్రపోతారు. మరికొందరు పక్కకు తిరిగి పడుకుంటారు. మరికొందరు కడుపు మీద బోర్లా పడుకుంటారు. మీరు నిద్రించే స్థానం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? కడుపు(Stomach)ను కిందకు పెట్టి బోర్లా నిద్రపోకూడదని ఇంట్లో చాలాసార్లు చెప్పే ఉంటారు. దీని వెనక కారణాలు కూడా ఉన్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం బోర్లా నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. ఇలా చేయడం ద్వారా, శరీరానికి ఒత్తిడి(Stress) ఉంటుంది. వెన్నెముక మీద ప్రభావం చూపిస్తుంది. ఈ భంగిమలో పడుకోవడం వల్ల శరీరం మధ్యలో చాలా బరువు పడుతుంది. వెన్నెముక స్థానం మారదు.. దానిపై ఒత్తిడి అవుతుంది. దీని కారణంగా శరీరంలోని ఇతర భాగాలలో కూడా నొప్పులు ఉంటాయి. కడుపు మీద నిద్రపోవడం(Sleeping) శరీరంలోని ప్రతి భాగానికి మంచిది కాదు.

బోర్లా నిద్రపోవడం వల్ల శరీరం(Body) క్రియారహితంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నొప్పి, జలదరింపు సమస్య శరీరంలోని వివిధ భాగాలలో మొదలవుతుంది. ఒక్కోసారి శరీరం మొద్దుబారిపోతున్నట్లు అనిపిస్తుంది. అలా నిద్రపోయే వారికి తరచుగా మెడ నొప్పి(Neck Pain) వస్తుంది. ఇతర సమస్యలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

గర్భవతులు(Pregnants) బోర్లా పడుకోకూడదు. అలాంటి పరిస్థితిలో ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే గర్భధారణ సమయంలో స్త్రీ తన కడుపుపై ​​నిద్రిస్తే, అది పిల్లలపై ప్రభావం చూపుతుంది.

అయితే బోర్లా పడుకుంటే.. కలిగే నష్టాలను తెలుసుకున్నారు. కానీ దాని వలన ప్రయోజనాలు కూడా కొన్ని ఉన్నాయి. కడుపు మీద బోర్లా పడుకుంటే.. అనేక నష్టాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నిద్రపోయేటప్పుడు గురక పెట్టే అలవాటు ఎవరికైనా ఉంటే, అది చాలా మందికి సమస్యలను పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు బోర్లా నిద్రపోతే గురక సమస్య ఉండదు.

తదుపరి వ్యాసం