తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Food During Periods : పీరియడ్స్ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది

Food During Periods : పీరియడ్స్ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది

Anand Sai HT Telugu

07 April 2024, 9:30 IST

    • Food During Periods In Telugu : పీరియడ్స్ సమయంలో మహిళలకు చిరాకుగా ఉంటుంది. ఈ సమయంలో మంచి ఆహారం తీసుకోవాలి.
పీరియడ్స్ సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు
పీరియడ్స్ సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు

పీరియడ్స్ సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు

నెలసరి సమయంలో సరైన ఆహారం తీసుకోవాలి. లేదంటే మహిళలు నీరసం అయిపోతారు. ఈ సమయంలో మీరు తీసుకునే ఆహారం మీకు శక్తినిచ్చేలా ఉండాలి. అనవసరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. పీరియడ్స్ సమయంలో చాలా చిరాకుగా, అలసటగా ఉంటుంది. కొంతమంది డిప్రెషన్, నొప్పి, కోపం, ఆందోళనను కూడా అనుభవిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

Raw Mango vs Ripe Mango: పచ్చి మామిడి vs పండిన మామిడి… ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

Brinjal in Pregnancy: గర్భిణులు వంకాయలు తినకూడదని ఆయుర్వేదం ఎందుకు చెబుతోంది?

National Dengue day 2024: డెంగ్యూను ‘ఎముకలు విరిచే జ్వరం’ అని ఎందుకు పిలుస్తారు? డెంగ్యూ వస్తే వెంటనే ఏం చేయాలి?

కొందరు కండరాల నొప్పులు, అనారోగ్యం, వికారం మొదలైన వాటిని అనుభవిస్తారు. కొంతమంది ఋతుచక్రంలో మొదటి రెండు రోజులు తమ రోజువారీ కార్యకలాపాలను చేయలేరు. దీర్ఘకాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పీరియడ్స్ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారం మీ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మీ అవయవాలు మరింత సజావుగా పని చేస్తాయి. మీరు అనుభవించే నొప్పిని తగ్గిస్తుంది.

పీరియడ్స్ సమయంలోని డైట్‌లో కొన్ని ఆహారాలు అవసరమైన శక్తిని అందిస్తాయి. శక్తిని పొందడంలో మీకు సహాయపడే కొన్ని ఆహారాలు ఇక్కడ ఉన్నాయి.

కెఫిన్ వద్దు

ఋతుస్రావం సమయంలో మీరు కెఫిన్ కలిగిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. కెఫిన్ తీసుకుంటే, కడుపులోని ఆమ్లాలు నొప్పిని పెంచే అవకాశం ఉంది. కెఫిన్ తీసుకోవాలనే కోరిక మీకు అనిపిస్తే, కాఫీకి బదులుగా టీ తాగడానికి ప్రయత్నించండి. టీ ఏ సమయంలోనైనా మంచిది. కెఫిన్ కోరికలకు ప్రత్యామ్నాయం కావచ్చు.

విటమిన్స్ ఉండే ఆహారాలు

ఈ సమయంలో ఆహారంలో విటమిన్లు చేర్చడం చాలా ముఖ్యం. విటమిన్ E మీ PMS లక్షణాలను ఉపశమనం చేస్తుంది. విటమిన్ ఇ పొందడానికి బటర్‌నట్ స్క్వాష్, గుడ్డు సొనలు తినండి. విటమిన్ B6 అపానవాయువు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. విటమిన్ సి మీ పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ సి పొందడానికి మీ ఆహారంలో ద్రాక్ష, నిమ్మకాయలను చేర్చుకోండి. విటమిన్ B6 పొందడానికి బంగాళదుంపలను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

డార్క్ చాక్లెట్ తినొచ్చు

డార్క్ చాక్లెట్‌ని మీ డైట్‌లో చేర్చుకోవడానికి పీరియడ్స్ అప్పుడు మంచి సమయం. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న డార్క్ చాక్లెట్ సెరోటోనిన్‌ని పెంచుతుంది. మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీ ఋతు చక్రం సమయంలోని ఆహారంలో డార్క్ చాక్లెట్ ఉండేలా చూసుకోండి.

కార్పోహైడ్రేట్లను చేర్చండి

పీరియడ్స్ సమయంలో మీకు తరచుగా రక్తస్రావం అవుతుంది. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం రక్తహీనతతో పోరాడటానికి, కోల్పోయిన హిమోగ్లోబిన్‌ను భర్తీ చేయడంలో మీకు సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని నీరసంగా, డిప్రెషన్‌గా భావించకుండా చేస్తుంది.

పండ్లు, కూరగాయలు తినండి

మీ పీరియడ్స్ సమయంలో ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చేర్చండి. క్యారెట్, ఆప్రికాట్, నారింజ, రేగు మొదలైనవి తినవచ్చు. ఇది ఈ సమయంలో వచ్చే చక్కెర కోరికలను తగ్గిస్తుంది.

పీరియడ్స్ సమయంలో కొందరు అమ్మాయిలు జంక్ ఫుడ్ తింటారు. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. వాటితో చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీ శరీరానికి శక్తినిచ్చే ఆహారాలను తీసుకుంటేనే మంచి జరుగుతుంది. తాజా పండ్లు, కూరగాయలు మీ డైట్‌లో చేర్చుకోవాలి. మద్యపానం, కూల్ డ్రింక్స్ లాంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమం. అప్పుడే మీకు నీరసంగా అనిపించకుండా ఉంటుంది.

తదుపరి వ్యాసం