HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beauty Tips: చెంపలపై గులాబీ రంగు మెరుపు కావాలా? ఈ గులాబీ రేకుల జెల్ వాడండి

Beauty Tips: చెంపలపై గులాబీ రంగు మెరుపు కావాలా? ఈ గులాబీ రేకుల జెల్ వాడండి

Haritha Chappa HT Telugu

17 July 2024, 8:00 IST

    • Beauty Tips: ముఖంపై గులాబీ రంగు మెరుపుదనం కావాలా? అలాంటి అందమైన ముఖం కావాలంటే ప్రతిరోజూ రోజ్ జెల్ ఉపయోగించండి. దీన్ని నెల రోజులు వాడితే చాలు గులాబీ మెరుపు మీ ముఖానికి వస్తుంది.
బ్యూటీ టిప్స్
బ్యూటీ టిప్స్ (Shutterstock)

బ్యూటీ టిప్స్

అందంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు? అందమైన, మచ్చలేని, మెరిసే ముఖం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఖరీదైన క్రీములు, బ్యూటీ ట్రీట్మెంట్లు, వివిధ రకాల ఫేషియల్స్ ఇలా ఎన్నో చేసేవారు ఎంతో మంది. అన్ని చేసిన కూడా గులాబీ రంగు మెరుపు చెంపలపై రావడం కష్టమే. రసాయనాలు నిండిన క్రీములు రాయడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. వాటి ఖరీదు కూడా ఎక్కువే. కాబట్టి అలాంటి క్రీముల కోసం డబ్బు ఖర్చు చేయడం వేస్టు. అవి మన చర్మానికి కూడా ప్రమాదకరం. కాబట్టి మేము మీకు ఇంట్లోనే గులాబీ పువ్వులతో చేసే రోజ్ జెల్ తయారీ చెబుతున్నాము. ఇది మీ ముఖానికి గులాబీ వర్ణం మెరుపును అందిస్తుంది. దీనిని తయారు చేయడం చాలా సులువు.

రోజ్ జెల్ తయారీ…

ఈ మ్యాజికల్ రోజ్ జెల్ తయారు చేసుకుని ముఖానికి ప్రతిరోజూ అప్లై చేస్తే మీ చర్మం కొన్ని రోజులకే మెరిసిపోతుంది. మీకు గులాబీ రేకులు దొరికితే… ఆ రేకులను వినియోగించుకోవచ్చు. మీకు తాజా గులాబీ రేకులు లేకపోతే, మార్కెట్లో లభించే రోజ్ పౌడర్‌ను కూడా ఉపయోగించవచ్చు. తాజా గులాబీ రేకులను శుభ్రంగా కడిగి వాటిని మిక్సీలో వేయాలి. రోజ్ వాటర్ కూడా మెత్తగా రుబ్బుకోవాలి. వాటిని వడకట్టి రసాన్ని వేరు చేయాలి. ఇప్పుడు ఈ జ్యూస్ లో కొద్దిగా అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ కలపాలి. అంతే రోజ్ జెల్ రెడీ అయిపోతుంది.

ప్రతి రాత్రి…

ఈ జెల్ ను మీరు ఎప్పుడైనా అప్లై చేయవచ్చు, రాత్రిపూట అప్లై చేయడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. రాత్రిపూట ఫేస్ వాష్ చేసుకున్నాక ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు రోజూ కొద్దిగా జెల్ తీసుకుని ముఖానికి బాగా మసాజ్ చేయాలి. ఈ జెల్ రాత్రిపూట మీ ముఖాన్ని మెరుగుపరచడానికి పనిచేస్తుంది. ప్రతిరోజూ పడుకునే ముందు ఈ జెల్ తో మసాజ్ చేయడం మర్చిపోవద్దు. కొద్ది రోజుల్లోనే ముఖంపై ఉన్న మరకలు మాయమై ముఖం గులాబీ రంగులో మెరిసిపోతుంది.

రోజ్ జెల్ అప్లై చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో వాడినవి సహజసిద్ధమైన వస్తువులే. దీన్ని ఇంట్లోనే తయారు చేశారు కాబట్టి పూర్తగా రసాయన రహితంగా ఉంటుంది. గులాబీలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖాన్ని కాంతివంతం చేయడానికి పనిచేస్తుంది. దీంతో పాటు రంధ్రాలు, మరకలు తెరుచుకునే సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కలబంద, విటమిన్ ఇ కూడా ముఖాన్ని మెరుగుపరచడానికి పనిచేస్తాయి. కొన్ని రోజులు ఈ జెల్ వాడిన తర్వాత ముఖం గులాబీ రంగులో మెరిసిపోవడం ఖాయం.

ఒక్కసారి ఈ రోజ్ జెల్ తయారు చేసుకుంటే నెల రోజుల పాటూ వాడుకోవచ్చు. రసాయనాలతో నిండిన క్రీములు వాడే కన్నా ఈ జెల్ వాడుకుంటే ఎంతో మంచిది. దీన్ని వాడడం ప్రారంభించాక కేవలం నెల రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్