తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  నడకతో వృద్ధుల్లో జ్ఞాపక శక్తి వృద్ధి.. తేల్చిన తాజా అధ్యయనం

నడకతో వృద్ధుల్లో జ్ఞాపక శక్తి వృద్ధి.. తేల్చిన తాజా అధ్యయనం

HT Telugu Desk HT Telugu

27 May 2023, 12:50 IST

  • నడక వల్ల వృద్ధుల్లో గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతాయని తాజా పరిశోధన ఒకటి తేల్చింది.

నడక వల్ల వృద్ధుల్లో గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతాయని తేల్చిన తాజా పరిశోధన
నడక వల్ల వృద్ధుల్లో గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతాయని తేల్చిన తాజా పరిశోధన (Unsplash)

నడక వల్ల వృద్ధుల్లో గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతాయని తేల్చిన తాజా పరిశోధన

వాకింగ్ (నడక) అల్జీమర్స్ వ్యాధితో సంబంధం ఉన్న ఒక నెట్ వర్క్ సహా మూడు బ్రెయిన్ నెట్‌వర్క్స్ కనెక్షన్లను పెంచుతుందని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుండి వచ్చిన ఒక కొత్త పరిశోధన వెల్లడించింది. వ్యాయామం మెదడు ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చుతుందని తెలిపింది.

అల్జీమర్స్ వ్యాధి నివేదికలకు సంబంధించిన జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. తేలికపాటి గ్రహణ శక్తి బలహీనతతో బాధపడుతున్న వృద్ధుల మెదడును, జ్ఞాపకం చేసుకునే సామర్థ్యాలను పరిశీలించింది. ఇందులో జ్ఞాపకశక్తి, తార్కికం, తీర్పు వంటి మానసిక సామర్థ్యాలలో స్వల్ప క్షీణత కనిపించింది. ఇది అల్జీమర్స్‌కు ప్రమాద కారకం.

‘తేలికపాటి గ్రహణ శక్తి బలహీనత, అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారిలో మెదడు నెట్‌వర్క్‌లు కాలక్రమేణా క్షీణించడం ఈ పరిశోధనలో మేం గమనించాం..’ అని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌తో కినిసాలజీ ప్రొఫెసర్, అధ్యయన ప్రధాన పరిశోధకుడైన జె. కార్సన్ స్మిత్ అన్నారు.

"వారు డిస్‌కనెక్ట్ అవుతారు. ఫలితంగా, స్పష్టంగా ఆలోచించేందుకు, విషయాలను గుర్తుంచుకోవడానికి వారి సామర్థ్యాన్ని కోల్పోతారు. వ్యాయామ శిక్షణ ఈ కనెక్షన్లను బలోపేతం చేస్తుందని మేం గమనించాం..’ అని వివరించారు.

ఈ అధ్యయనం స్మిత్ మునుపటి పరిశోధనపై ఆధారపడి ఉంది. సెరిబ్రల్ రక్త ప్రవాహాన్ని నడక వ్యాయామం ఎలా తగ్గిస్తుంది? తేలికపాటి గ్రహణ శక్తి బలహీనత ఉన్న వృద్ధులలో మెదడు పనితీరును ఎలా మెరుగుపరుస్తుందో గమనించారు.

12 వారాల నడక వ్యాయామం అనంతరం టెస్టులు మళ్లీ నిర్వహించినప్పుడు పరిశోధనల పాల్గొన్న పార్టిసిపెంట్లలో జ్ఞాపకం చేసుకునే శక్తి వృద్ధి చెందినట్టు గమనించారు.