తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Face Packs | సమ్మర్​లో టొమాటోతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Face Packs | సమ్మర్​లో టొమాటోతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

HT Telugu Desk HT Telugu

21 April 2022, 14:13 IST

google News
    • సమ్మర్​లో చర్మం ట్యాన్​ అయిపోతుంది. దానిని తొలగించుకోవడానికి చాలా కష్టపడుతుంటాం. పైగా ఎండవల్ల చర్మంపై రకరకాల సమస్యలు వస్తుంటాయి. కమిలే ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంటాం. మీరు కూడా ఈ ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారా? అయితే మీరు టొమాటోకు దగ్గరవ్వండి. అదేంటి అనుకుంటున్నారా? ఇది చదివేయండి.
టమాటాతో ఫేస్ ప్యాక్స్
టమాటాతో ఫేస్ ప్యాక్స్

టమాటాతో ఫేస్ ప్యాక్స్

Skin Care in Summer | విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, విటమిన్ కె వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన టమోటాలు మీ మొత్తం ఆరోగ్యానికి గొప్పగా సహకరిస్తాయి. అంతేకాకుండా మీ చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. మీ స్కిన్ టోన్‌ను ప్రకాశవంతం చేస్తాయి. దానిలోని ఆస్ట్రింజెంట్ లక్షణాలు మురికిని తొలగించి.. చర్మాన్ని తాజాగా పునరుజ్జీవింపజేస్తాయి. అంతే కాకుండా టాన్‌ను కూడా తొలగిస్తాయి. సన్‌బర్న్‌ల నుంచి ఉపశమనం ఇస్తాయి. అయితే టమోటాను వేరే పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు.

టొమాటో, అలోవెరా ఫేస్ ప్యాక్

ఎండాకాలంలో మన చర్మం భరించలేని వేడిని భరిస్తుంది. ఇది నిస్తేజంగా మారి.. శరీరంపై నల్లని మచ్చలను అభివృద్ధి చేస్తుంది. అలాంటప్పుడు టమోటా, కలబంద కలిపిన ఫేస్ ప్యాక్​ని ప్రయత్నించండి. పండిన టొమాటోను మెత్తగా చేసి.. అందులో అలోవెరా జెల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడ అంతటా అప్లై చేయండి. 10 నిముషాల తర్వాత నీటితో శుభ్రం చేయండి.

టొమాటో, శనగపిండి ఫేస్ ప్యాక్

యాంటీమైక్రోబయల్ లక్షణాలతో ప్యాక్ చేయబడిన శెనగ పిండి మీ చర్మం నుంచి మురికిని తొలగిస్తుంది. టొమాటోలు మొటిమలు, డార్క్ స్పాట్‌లను తగ్గించి మీ చర్మాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా మారుస్తుంది. ఒక టేబుల్ స్పూన్ బేసన్, ఒక మెత్తని టొమాటో, అరకప్పు పెరుగు, కొంచెం పసుపు కలపండి. ఈ ప్యాక్‌ని మీ ముఖం అంతా అప్లై చేసి 15 నిమిషాలు ఉంచి.. తర్వాత కడిగేయండి.

టొమాటో, తేనె ఫేస్ ప్యాక్

టమోటా, తేనె ప్యాక్ ముడతలు, ఫైన్ లైన్లను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. టొమాటోలోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి.. దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేస్తుంది. ఒక చెంచా తేనెతో ఒక టమోటా గుజ్జు కలపండి. దానితో మీ ముఖమంతా మసాజ్ చేయండి. పొడిగా అయిన తర్వాత శుభ్రం చేసుకోండి.

టొమాటో, పెరుగు, నిమ్మకాయ ఫేస్ ప్యాక్

టాన్ తొలగించడానికి సహజ మార్గం కోసం చూస్తున్నారా? అయితే టొమాటో, పెరుగు, నిమ్మకాయ ఫేస్ ప్యాక్‌.. ట్యాన్​ తొలగించి.. మీ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా మృదువైన, ప్రకాశవంతమైన లుక్​ ఇస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల టమోటా గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలపి.. ముఖానికి ప్యాక్ వేయండి. 15-20 నిమిషాలు ఉంచి దానిని కడిగేయండి.

టొమాటో, ఆలివ్ ఆయిల్ ఫేస్ ప్యాక్

ఈ టొమాటో, ఆలివ్ ఆయిల్ ఫేస్ ప్యాక్ పొడి చర్మం ఉన్నవారికి ఖచ్చితంగా సరిపోతుంది. టొమాటోలు సూర్యరశ్మికి రక్షణగా పనిచేస్తాయి. చికాకు నుంచి చర్మానికి ఉపశమనం ఇస్తాయి. ఆలివ్ ఆయిల్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. రెండు టేబుల్ స్పూన్ల టొమాటో గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి.. ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేయండి. ఈ ప్యాక్‌ని వారానికి రెండుసార్లు ఉపయోగించండి.

టాపిక్

తదుపరి వ్యాసం