Summer Special Sarees | వేసవి కాలంలో ఫంక్షన్లా? అయితే ఈ చీరలు కట్టుకోండి..
09 April 2022, 15:04 IST
- సమ్మర్లో ఎక్కువ పెళ్లిల్లు, ఫంక్షన్లు జరుగుతాయి. కానీ ఆ ఫంక్షన్లు డ్రెస్‌లు వేసుకుని వెళ్లలేము. కచ్చితంగా చీరలు కట్టుకోవాలి. కానీ సమ్మర్లో చీరలు కట్టుకోవాలంటే సాహసమనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఫంక్షన్ల సమయంలో పట్టుచీరలు చాలా ఇబ్బంది పెడతాయి. కానీ కొన్ని చీరలు మీకు లుక్‌తో పాటు సౌకర్యంగా ఉంటాయి. మీరు ఈ వేసవిలో షాపింగ్‌కు వెళ్లాలనుకుంటున్నట్లయితే.. ఈ రకమైన చీరలను ఎంపిక చేసుకోండి.
సమ్మర్ స్పెషల్ శారీలు
Summer Special Sarees | ఏ భారతీయ వార్డ్‌రోబ్‌లోనైనా చీరలు కచ్చితంగా ఉంటాయి. అవి తరతరాలుగా వస్తున్న వారసత్వ సంపద. మారుతున్న సీజన్లు, ట్రెండ్‌లను బట్టి దుస్తుల ఎంపిక మారుతుంది. కానీ చీర మాత్రం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఈ ఎత్నిక్ వేర్ ఎంపిక ఖచ్చితంగా మారుతున్న వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇది వేసవి కాలం కాబట్టి వేడిని ఇచ్చే, చిరాకు రప్పించే చీరలను ఎంచుకోరు. కాబట్టి చల్లగా, సౌకర్యవంతంగా ఉంచడానికి ఇష్టపడతారు. కానీ అవి స్టైలిష్‌గా కూడా ఉండాలి. కాబట్టి.. ఈ వేసవిలో మీరు ఈ ట్రెండ్ చీరలను ఎంచుకోండి..
1. కాటన్ చీరలు
కాటన్ చీరలు వేసవి ఫ్యాషన్‌లో ముందంజలో ఉంటాయి. ఎందుకంటే వేసవిలో అవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అందుకే సమ్మర్లో కాటన్ చీరలు కొట్టుకునేందుకు మహిళలు ఓటేస్తారు. వీటికి సమ్మర్లో డిమాండ్ పెరగడంతో స్వచ్ఛమైన కాటన్, బ్లెండెడ్ చీరలు అందుబాటులోకి వస్తున్నాయి.
2. షిఫాన్ చీరలు
తేలికైగా షిఫాన్ చీరలు సమ్మర్లో మంచిగా ఉంటాయి. బరువు ఉండే చీరలు సమ్మర్లో చిరాకు రప్పిస్తాయి. అలాంటి సమయంలో షిఫాన్ చీరలు మంచి ఎంపిక. ఇవి తేలికగా ఉండి మీకు చాలా అందాన్ని కూడా ఇస్తాయి. ఈ చీరలు సన్నగా ఉండే మెటీరియల్‌తో తయారు చేస్తారు కాబట్టి.. ఏ శరీరానికైనా చక్కగా నప్పుతుంది. చాలా మంది ప్రముఖులు తమ బహిరంగ ప్రదర్శనల సమయంలో షిఫాన్ చీరలనే ఎంచుకుంటారు.
3. ఫ్లోరల్ ప్రింట్ చీరలు
మహిళలు ఇష్టపడే స్ప్రింగ్, సమ్మర్ ప్రింట్‌లు అందరికీ బాగా నప్పుతాయి. ఇవి తాజా లుక్‌ని ఇస్తాయి. పసుపు, గులాబీ, ఆకుపచ్చ, తెలుపు రంగులలో.. పూల ప్రింట్ చీరలు వస్తాయి.
4. రా సిల్క్ చీరలు
పండుగలు లేదా వేసవిలో జరిగే వివాహాల కోసం, స్వచ్ఛమైన పట్టు కంటే తేలికైన పట్టు రూపాన్ని ఇచ్చే రా సిల్క్ చీరలను ఎంచుకోండి. ఇవి పట్టు చీరల మాదిరిగానే అందంగా, సొగసైనవిగా ఉంటాయి. తేలికగా, సౌకర్యవంతంగా ఉంటాయి.
5. జరీ చీరలు
లేస్ చీరలు చక్కదనం, సొగసుకు ప్రతిరూపం. వివాహాలు, ఉత్సవాలు, సాధారణ సమావేశాలకు జరీ చీరలు మంచి ఎంపిక.