తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Smart Phone Problems : రోజుకు 4 గంటలకుపైగా ఫోన్ వాడితే ఆత్మహత్య ఆలోచనలు!

Smart Phone Problems : రోజుకు 4 గంటలకుపైగా ఫోన్ వాడితే ఆత్మహత్య ఆలోచనలు!

Anand Sai HT Telugu

08 December 2023, 13:40 IST

google News
    • Smart Phone Using Problems : ఈ కాలంలో శరీరంలో ఓ భాగంలా అయిపోయింది స్మార్ట్ ఫోన్. ఎక్కడకు వెళ్లినా అది లేకుండా ఉండటం కష్టం. కానీ 4 గంటలకంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం మంచిది కాదని అంటున్నాయి అధ్యయనాలు.
అతిగా ఫోన్ వాడితే సమస్యలు
అతిగా ఫోన్ వాడితే సమస్యలు

అతిగా ఫోన్ వాడితే సమస్యలు

ఇటీవలి కాలంలో చిన్నాపెద్దా తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. పదేళ్లలోపు పిల్లలు కూడా ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఏడిస్తే ఫోన్, తినిపించాలంటే ఫోన్.. ఇలా ఫోనే లోకం అయిపోయింది. స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకు మరింత పెరిగిపోతుంది. టెక్నాలజీ పెరగడం మంచిదే కానీ.. మనిషిని నాశనం చేసే టెక్నాలజీని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. ఫోన్ వినియోగం వల్ల ఆరోగ్య ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

కౌమారదశలో ఉన్నవారు ప్రతిరోజూ నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌లలో మునిగిపోతే మానసిక ఆరోగ్యం సరిగా ఉండదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వినియోగం మానసిక రుగ్మతలు, నిద్ర సమస్యలు, కంటి సంబంధిత సమస్యలు, మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్‌ల వంటి సమస్యలకు దారితీస్తాయి.

కౌమారదశలో ఉన్నవారు స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం, ఆరోగ్యం మధ్య సంబంధాన్ని కొరియాలోని హన్యాంగ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ బృందం పరిశోధించింది. ఇందులో 50,000 కంటే ఎక్కువ మంది కౌమారదశలో ఉన్నవారి డేటాను విశ్లేషించింది. ఈ పరిశోధనలో పాల్గొన్నవారు స్మార్ట్‌ఫోన్‌లో గడిపిన గంటలు, వారి ఆరోగ్య చర్యలను పరిశీలించారు.

రోజుకు నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే కౌమారదశలో ఉన్నవారిలో ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు, మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువగా ఉందని తేలింది. రోజుకు నాలుగు గంటల కంటే తక్కువగా వాడే వారిలో ఇలాంటి ఆలోచనలు తక్కువగా ఉన్నాయి.

రోజుకు ఒకటి నుండి రెండు గంటలు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే కౌమారదశలో ఉన్నవారికి తక్కువ సమస్యలను ఎదుర్కొంటారని ఓపెన్ యాక్సెస్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనం స్మార్ట్‌ఫోన్ వినియోగం, ఆరోగ్య సమస్యల మీద జరిగింది. అసలు ఫోన్ వాడకం తగ్గిస్తేనే చాలా మంచిది.

ఫోన్ అతిగా వాడితే నిద్ర చక్రం దెబ్బతింటుంది. రాత్రిపడుకునే ముందు ఫోన్ స్క్రీన్ చూస్తే సరిగా నిద్రరాదు. అందులో నుంచి వచ్చే బ్లూలైట్ మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఈ నిద్ర హార్మోన్ తక్కువైతే నిద్రపట్టదు. బ్లూలైట్ ఎక్కువసేపు కంటిపై పడితే నిద్రలేమి సమస్య వస్తుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఫోన్ చూస్తూ ఉంటే కళ్లు అలసిపోతాయి. కళ్లు పొడిబారడం, అస్పష్టమైన దృష్టి, తలనొప్పి, నిరసంలాంటివి వస్తాయి. ఫోన్ వాడకం ఎక్కువైతే దృష్టి సమస్యలు అధికమవుతాయి. రోజంతా ఫోన్ వాడితే.. మెడ, వెన్నెముక ఎక్కువసేపు వంగే ఉంటుంది. దీంతో దీర్ఘకాలిక వెన్నెముక సమస్యలు వస్తాయి.

తదుపరి వ్యాసం