Crime news : అత్యాచార బాధితురాలిపై యాసిడ్​ దాడి.. చివరికి అది తాగి నిందితుడి ఆత్మహత్య!-delhi rape accused throws acid at girl drinks it himself dies ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : అత్యాచార బాధితురాలిపై యాసిడ్​ దాడి.. చివరికి అది తాగి నిందితుడి ఆత్మహత్య!

Crime news : అత్యాచార బాధితురాలిపై యాసిడ్​ దాడి.. చివరికి అది తాగి నిందితుడి ఆత్మహత్య!

Sharath Chitturi HT Telugu
Dec 08, 2023 06:39 AM IST

Delhi crime news : అత్యాచార బాధితురాలిపై యాసిడ్​ దాడి చేశాడు నిందితుడు. ఆ తర్వాత, మిగిలిపోయిన యాసిడ్​ని తాగేసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దిల్లీలో జరిగింది.

అత్యాచార బాధితురాలిపై యాసిడ్​ దాడి..
అత్యాచార బాధితురాలిపై యాసిడ్​ దాడి..

Delhi crime news : దిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచార బాధితురాలిపై నిందితుడు యాసిడ్​ దాడి చేశాడు. అనంతరం.. అదే యాసిడ్​ తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇదీ జరిగింది..

దిల్లీలోని ఆనంద్​ ప్రభాత్​ నగర్​లో గురువారం జరిగింది ఈ ఘటన. కొన్ని నెలల క్రితం.. 54ఏళ్ల ప్రేమ్​ సింగ్​, ఓ 17ఏళ్ల మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదులతో.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అతడిని అరెస్ట్​ చేసి జైలుకు పంపించారు.

కాగా.. ఆ వ్యక్తి.. కొన్ని కారణాలతో ఇటీవలే జైలులో నుంచి బెయిల్​పై బయటకు వచ్చాడు. గురువారం ఉదయం 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో.. బాలిక ఇంటి వద్దకు వెళ్లాడు. తనపై వేసిన కేసును వెనక్కి తీసుకోవాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. కానీ.. బాలిక అందుకు అంగీకరించలేదు. కోపంతో ఊగిపోయిన ఆ 54ఏళ్ల వ్యక్తి.. తనతో పాటు తెచ్చుకున్న యాసిడ్​ బాటిల్​ని ఓపెన్​ చేశాడు. ఎదురుగా ఉన్న బాలిక మీద పోశాడు. ఆమె బాధతో విలపించింది. అదే సమయంలో.. మిగిలి పోయిన యాసిడ్​ని తాగేశాడు ఆ వ్యక్తి. ఇదంతా.. కొన్ని క్షణాల్లో జరిగిపోయింది!

Delhi acid attack : బాలిక అరుపులతో పరుగెత్తుకుంటూ వచ్చిన స్థానికులు.. బాధితురాలు, నిందితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదే సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. బాలికపై యాసిడ్​ దాడి జరిగిందని చెప్పారు.

ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. అప్పటికే వారిని ఆసుపత్రికి తరలించారని తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లారు. బాలికతో మాట్లాడగా.. జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. కాగా.. చికిత్స పొందుతూ.. నిందితుడు మరణించాడని వైద్యులు, పోలీసులకు వివరించారు.

Acid attack on rape victim : యాసిడ్​ దాడితో స్వల్పంగా గాయపడిన బాలికకు చికిత్స అందించిన అనంతరం.. వైద్యులు ఆమెను విడిచిపెట్టారని పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం