Sangareddy Crime : 22 ఏళ్ల యువతిపై 60 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం, ఏడాదిన్నర జైలు శిక్ష విధింపు
Sangareddy Crime : 22 ఏళ్ల యువతిపై 60 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. ఈ కేసులోసంగారెడ్డి జిల్లా స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి అనిత దామోదర్ రాయపోల్ తీర్పు ఇచ్చారు. నిందితుడి ఏడాదిన్న జైలు శిక్ష విధించారు.
Sangareddy Crime : సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మద్దికుంటలో ఫిబ్రవరి 3, 2022న యువతి ఒక్కతే ఇంట్లో ఉండటం గమనించిన, అదే గ్రామానికి చెందిన బోయిని కిష్టయ్య తన కోరిక తీర్చమంటూ చేయి పట్టుకుని బలవంతం చేశాడు. దీంతో తన కూతురు గట్టిగా కేకలు వేసుకుంటూ బయటకు పరిగెత్తిందని, బాధితురాలి తల్లి సదాశివపేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇంట్లోకి ప్రవేశించి, తన కూతురిపై అత్యాచారయత్నం చేయబోయిన బోయిని కిష్టయ్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జరిమానా చెల్లించకపోతే మరో 7 రోజుల జైలు శిక్ష
బాధిత యువతి తల్లి ఫిర్యాదుతో కేసును నమోదు చేసి, ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారు పోలీసులు. నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టి విచారణ చేపట్టింది. ఈ కేసులో నేర ఆరోపణ రుజువైనందున సంగారెడ్డి జిల్లా స్పెషల్ మొబైల్ కోర్టు, న్యాయమూర్తి అనిత దామోదర్ రాయపోల్ తన తీర్పును వెలవరిస్తూ... నిందితుడికి ఏడాదిన్నర సాధారణ జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే 7 రోజుల జైలు శిక్ష విధిస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ... నిందితునికి శిక్షపడేలా కృషి చేసిన అధికారులను అభినందించారు. నేరస్థులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుందన్నారు. తిరిగి ఇలాంటి నేరాలు చేయడానికి వెనుకడుగు వేస్తారన్నారు.