Google Pay: గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్..!
01 April 2022, 19:20 IST
- డిజిటల్ పేమెంట్స్ సేవల యాప్ గూగుల్ పే (Google Pay) వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకవచ్చింది. తాజాగా‘ట్యాప్ టూ పే’(Tap to pay) అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. దీనితో, వినియోగదారులు ఎటువంటి QR కోడ్‌ను స్కాన్ చేయకుండానే చెల్లింపులు చేయవచ్చు.
Gpay
డిజిటల్ పేమెంట్స్ సేవల యాప్ గూగుల్ పే (Google Pay) వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకవచ్చింది. తాజాగా‘ట్యాప్ టూ పే’(Tap to pay) అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. దీనితో, వినియోగదారులు ఎటువంటి QR కోడ్‌ను స్కాన్ చేయకుండానే చెల్లింపులు చేయవచ్చు. POS మెషీన్‌లో మీ ఫోన్‌ను ట్యాప్ చేయడం ద్వారా చెల్లింపులు జరపవచ్చు.
ఇందు కోసం ఫిన్‌టెక్ సంస్థ పైన్ ల్యాబ్స్‌తో గూగుల్ పే జతకట్టింది. Tap to pay ఫీచర్ ద్వారా యూజర్లు తమ కార్డ్‌లను ఉపయోగించకుండా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. ప్రాథమికంగా రిలయన్స్ రిటైల్, స్టార్‌బక్స్, ఫ్యూచర్ రిటైల్ లాంటి ప్రముఖ సంస్థలలో పీఓఎస్ టెర్మినల్‌ని ఉపయోగించి లావాదేవీల చేయవచ్చు.
QR కోడ్‌ని స్కాన్ చేయడం లేదా UPI-లింక్డ్ మొబైల్ నంబర్‌ను ఇవ్వడానికి బదులుగా, వినియోగదారులు చెల్లింపు చేయడానికి POS టెర్మినల్‌లోని ఫోన్‌ను నొక్కాలని కంపెనీ తెలిపింది. దీని తర్వాత వినియోగదారు తన UPI పిన్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది.
ట్యాప్ టూ పే ఫీచర్ పని తీరుకు సంబంధించిన పలు వివరాలను గూగుల్ పే బిజినెస్ హెడ్ సశిత్ శివానందన్ మీడియాకు వెల్లడించారు. యూపీఐ పేమెంట్స్ ద్వారా చాలా తక్కువ సమయంలో లావాదేవీలు జరుగుతాయని, అవుట్‌లెట్లలో, క్యూ మేనేజ్‌మెంట్ వల్ల వచ్చే సమస్యలను కూడా చాలా వరకు తగ్గించవచ్చు అభిప్రాయపడ్డారు. ఇక గూగుల్ పేతో పైన్ ల్యాబ్స్ భాగస్వామిగా చేరడం చాలా సంతోషంగా ఉందని పైన్ ల్యాబ్స్ బిజినెస్ చీఫ్ ఖుష్ మెహ్రా తెలిపారు. కాంటక్ట్‌లెస్ పేమెంట్స్ జరిపేందుకు పైన్ ల్యాబ్స్ అభివృద్ది చేసిన POS చాలా బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
టాపిక్