తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /   Google Chrome: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హెచ్చరిక!

Google Chrome: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హెచ్చరిక!

HT Telugu Desk HT Telugu

20 March 2022, 17:07 IST

google News
    • Google Chrome 99.0.4844.74  వెర్షన్‌ని ఉపయోగిస్తున్న వారు  జాగ్రత్తగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సూచించింది. Google Chrome 99.0.4844.74 వెర్షన్‌లో అనేక లొసుగులు ఉన్నట్లు CERT-In వెల్లడించింది. భద్రతా లోపాలను అసరగా చేసుకుని హ్యాకర్లు దాడి చేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Google Chrome
Google Chrome (HT_PRINT)

Google Chrome

Google Chrome ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. తాజాగా కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన 'ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్' (సర్ట్-ఇన్) గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా Google Chrome 99.0.4844.74 పాత వెర్షన్‌ని ఉపయోగిస్తున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. Google Chrome 99.0.4844.74 వెర్షన్‌లో అనేక లొసుగులు ఉన్నట్లు CERT-In వెల్లడించింది. భద్రతా లోపాలను అసరగా చేసుకుని హ్యాకర్లు దాడి చేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కావున వినియోగదారులు తమ Google Chromeని అప్‌డేట్ చేయాలని సూచించారు . హ్యాకర్లు బెడద నుండి తప్పించుకోవడానికి యూజర్లు 99.0.4844.74 గూగుల్ క్రోమ్ వెర్షన్ అప్‌డెట్ చేసుకోవాలని CERT తెలిపింది.

Google Chrome బ్రౌజర్‌ని ఇలా అప్‌డేట్ చేయండి

Google Chrome బ్రౌజర్‌ని ఒపెన్‌ చేసి.. కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చిన్న చుక్కలపై క్లిక్ చేయండి. అక్క డ కనిపించే హెల్ఫ్‌పై క్లిక్‌ చేయండి. మీకు బ్రౌజర్ వెర్షన్‌ కనిపిస్తోంది. అప్పుడు అప్‌డేట్‌ అప్షన్‌పై క్లిక్‌ చేయండి.మరో విధంగా కూడా Google Chrome బ్రౌజర్‌ని చేసుకోవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్‌కి వెళ్లి.. గూగుల్‌ క్రోమ్‌ సెలక్ట్ చేసుకుని.. దానిపై క్లిక్‌ చేసి అప్‌డేట్‌ చేసుకుంటే సరిపోతుంది.

తదుపరి వ్యాసం