తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ovarian Cancer: అండాశయ క్యాన్సర్.. తొలి దశ లక్షణాలివే..

Ovarian cancer: అండాశయ క్యాన్సర్.. తొలి దశ లక్షణాలివే..

HT Telugu Desk HT Telugu

28 May 2023, 13:48 IST

google News
  • Ovarian cancer: అండాశయ క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం.  దానికి సంబంధించిన వ్యాధి లక్షణాలేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

అండాశయ క్యాన్సర్ లక్షణాలు
అండాశయ క్యాన్సర్ లక్షణాలు (Shutterstock)

అండాశయ క్యాన్సర్ లక్షణాలు

అండాశయ క్యాన్సర్ లక్షణాలు గుర్తించడం చాలా కష్టం. చాలా తక్కువ లక్షణాలు మొదటి దశలో కనిపిస్తాయి. అండాశయంలో లేదా ఫాలోపియన్ ట్యూబుల్లో ఈ క్యాన్సర్ మొదలవ్వొచ్చు. అండాశయం మహిళల్లో అండం విడుదలవ్వడానికి, సంతానోత్పత్తికి, హార్మోన్లకు కారణం. కొన్ని లక్షణాలను గమనించడం ద్వారా ఈ వ్యాధిని మొదట్లోనే గుర్తించొచ్చు.

అండాశయ క్యాన్సర్ లక్షణాలు:

1. పొత్తికడుపులో ఉబ్బరం:

కడుపు నిండి ఉన్నట్లు, లేదా కడుపు బిగుతుగా అనిపించే లక్షణం ఇది. కొన్ని సార్లు వాపు కూడా ఉంటుంది. ఎక్కువగా తినడం, గ్యాస్, మలబద్దకం, ఒవేరియన్ లేదా అండాశయ క్యాన్సర్ వల్ల ఈ లక్షణం కనిపించొచ్చు.

2. పెల్విక్ నొప్పి

ఇది పొత్తికడుపు లేదా కటి ప్రాంతంలో అసౌకర్యం లేదా నొప్పిని సూచిస్తుంది. నెలసరిలో వచ్చే నొప్పులు, కటి ప్రాంతంలో వాపు, అండాశయంలో తిత్తులు, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మార్పుల వల్ల ఈ సమస్య రావచ్చు.

3. తరచూ మూత్ర విసర్జన

అండాశయ కణాలు మూత్రాశయ గోడల వెలుపల పెరిగినపుడు లేదా కటి ప్రాంతంలో మార్పుల వల్ల తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాలనిపిస్తుంది.

4. ఆకలి తగ్గిపోవడం

అండాశయ క్యాన్సర్ లక్షణాల్లో ఇది ముఖ్యమైంది. ఆకలి తగ్గడంతో పాటే ఏది తిన్నా వెంటనే కడుపు నిండిన భావన కలగడం, కొంచెం కూడా తినలేకపోవడం కూడా ఇతర లక్షణాలు.

5. వెన్ను నొప్పి:

ఇది కూడా అండాశయ క్యాన్సర్‌ లక్షణాల్లో ఒకటి. నిద్ర కూడా పట్టకుండా వెనక కింది భాగంలో నొప్పి రావడం, అసౌకర్యంగా ఉండటం ఒక సూచనే. కటిలో ద్రవాలు ఉండటం వల్ల వెనక భాగంలో ఉన్న కణజాలంలో ఇబ్బంది కలిగిస్తుంది.

6. అలసట:

తరచూ అలసటగా ఉండటం కూడా ఒక లక్షణమే. అనేక కారణాల వల్ల క్యాన్సర్ వల్ల అలసట రావచ్చు. ఇది ప్రొటీన్, హర్మోన్ల స్థాయుల్ని మార్చేస్తుంది. దానివల్లే అలసటగా, నీరసంగా అనిపిస్తుంది.

7. అజీర్తి:

కడుపులో నొప్పి, ఆహారం జీర్ణం అవకపోవడం కూడా దీని మొదటి దశ లక్షణాల్లో ఒకటి.

8. మల బద్దకం:

మల విసర్జన సులభంగా అవ్వకపోవడం, అసౌకర్యం కూడా ఉండొచ్చు. మొదట్లోనే దీనికి చికిత్స తీసుకుంటే మంచిది.

9. నెలసరిలో మార్పులు:

పీరియడ్స్ ముందుగా లేదా ఆలస్యంగా రావడం. నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా అవ్వడం,క్రమం లేకుండా పీరియడ్స్ రావడం, పీరియడ్స్ మధ్యలో కూడా రక్తస్రావం అవ్వడం గమనిస్తే జాగ్రత్త పడాలి.

పెల్విక్ పరీక్ష, CT స్కాన్, రక్త పరీక్ష చేసి అండాశయ క్యాన్సర్ గుర్తించొచ్చు. మీకేమైనా లక్షణాలు తరచూ కనిపిస్తుంటే వైద్యుల్ని సంప్రదించండి. ముందుగా వ్యాధి గుర్తిస్తే చికిత్స సరిగ్గా అందుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం