తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ugadi Pachadi Recipe: ఉగాది పచ్చడి సంప్రదాయ పద్ధతిలో ఇలా చేసుకుని తినండి, ఎంతో శుభం

Ugadi Pachadi Recipe: ఉగాది పచ్చడి సంప్రదాయ పద్ధతిలో ఇలా చేసుకుని తినండి, ఎంతో శుభం

Haritha Chappa HT Telugu

08 April 2024, 20:00 IST

    • Ugadi Pachadi Recipe: ఉగాది పచ్చడిని ఏడాదిలో ఒకే ఒక రోజు రుచి చూస్తాము. ఉగాది పండుగలో ప్రత్యేకమైనది ఈ ఉగాది పచ్చడి. దీన్ని సంప్రదాయ పద్ధతిలో ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
ఉగాది పచ్చడి రెసిపీ
ఉగాది పచ్చడి రెసిపీ (HomeCookingShow/Youtube)

ఉగాది పచ్చడి రెసిపీ

Ugadi Pachadi Recipe: తెలుగు సంస్కృతిలో ఉగాది పండుగకు ఎంతో విలువ ఉంది. తెలుగు సంవత్సరాదిలో నూతన సంవత్సర దినంగా ఉగాదిని నిర్వహించుకుంటారు. షడ్రుచులను కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఈ ఆరు రకాల రుచుల మిశ్రమాన్ని ఉగాది రోజున రుచి చూడాలి. ఆరు రుచులు అంటే... తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు. ఈ రుచులను కలిగి ఉన్న ఆహారాలను కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Soya Dosa: టేస్టీ సోయా దోశ రెసిపీ, డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్

Monday Motivation: ఎవరి గొప్ప వారిదే, జీవితంలో ఎదురయ్యే ఎవరినీ చులకనగా చూడకండి

Acid Reflux At Night : రాత్రి గుండెల్లో మంట రావడానికి కారణాలు.. ఈ అసౌకర్యాన్ని ఎలా తొలగించాలి?

Relationship Tips : పెళ్లికి ముందే ఈ 5 విషయాలు చర్చించండి.. లేదంటే తర్వాత సమస్యలు

ఉగాది రోజు ఈ ఆరు రుచులను తినడం చాలా ముఖ్యం. ఈ ఆరు రుచులు ఆనందానికి, దుఃఖానికి జీవితంలోని ఎన్నో అనుభూతులకు చిహ్నంగా భావిస్తారు. ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని మూడు దోషాలైన వాత, పిత్త కఫాలను సమతుల్యం చేయడానికి కూడా ఈ రుచుల మిశ్రమం చాలా అవసరం. ఉగాది పచ్చడి అనేది ఔషధ విలువలను కలిగి ఉంటుందని చెబుతారు.

ఉగాది పచ్చడి ఎలా చేయాలి?

వేప పువ్వు తరుగు - ఒక స్పూను

బెల్లం తరుగు - ఒక స్పూను

చింతపండు రసం - మూడు స్పూన్లు

కారం - అర స్పూను

ఉప్పు - చిటికెడు

మామిడి తురుము - మూడు స్పూన్లు

ఉగాది పచ్చడి రెసిపీ

1. మామిడికాయ ముక్కలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఒక గిన్నెలో తురిమిన మామిడిని, సన్నగా తరిగిన వేప పువ్వును, బెల్లం తురుమును, చింతపండు రసాన్ని, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

3. అంతే ఉగాది పచ్చడి రెడీ అయినట్టే.

కొంతమంది ఈ ఉగాది పచ్చడిలో పండిన అరటిపండును, పుట్నాల పప్పును, కొబ్బరి ముక్కలను కూడా వేసుకుంటారు. ఇది వారి వారి ఇష్టప్రకారం ఉంటుంది. నిజానికి ఉగాది పచ్చడిలో అరటిపండు, శనగపప్పు, ఇతర ఆహారాలేవి కలపరు. సాంప్రదాయంగా చేసే ఉగాది పచ్చడిలో కేవలం మామిడికాయ, వేప పువ్వు, బెల్లం, చింతపండు, కారం, ఉప్పు మాత్రమే ఉంటాయి. కొంతమంది కారానికి బదులుగా మిరియాల పొడిని కూడా వేసుకుంటారు. ఉగాది పచ్చడిలో మనం వినియోగించేవన్నీ అని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే.

టాపిక్

తదుపరి వ్యాసం